ప్రముఖ మలయాళీ నటి భావన ఎట్టకేలకు తన వ్యక్తిగత జీవితంలో జరిగిన అత్యంత వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడింది. 2017లో ఒక సినిమా షూటింగ్‌ని పూర్తి చేసుకుని భావన తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు, ఆమెను కిడ్నాప్ చేసి 2 గంటలకు పైగా దాడి చేశారు. ఇది అప్పట్లో సంచలనం సృష్టించింది. సుప్రసిద్ధ మలయాళీ హీరో దిలీప్ కు కూడా ఈ కేసుతో సంబంధం ఉండడంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. దిలీప్ బెయిల్‌పై విడుదలయ్యాడు.…
‘బాహుబలి’ సక్సెస్ తో దక్షిణాది చిత్రాలకు క్రేజ్ వచ్చింది. దాంతో కన్నడ భాషలో రూపుదిద్దుకున్న ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. అదే స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ…