Sonu Sood: సోనూ సూద్ హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ 2023 జనవరిలో సెట్స్ పైకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోనూ సూద్ ఈ పేరు వింటే సామాన్యుడి పెదవిపై చిరునవ్వు విరబూస్తుంది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన కరోనా మూలంగా చితికిపోయిన ఎందరో గడపల్లో దీపమై, వారికి కుటుంబాలకు ఆరాధ్యుడు అయ్యాడు. బాలీవుడ్‌లో స్టార్ నటుడిగా కొనసాగుతున్న సోనుసూద్ 2023 లో ఒక అత్యంత శక్తివంతమైన సబ్జెక్ట్ తో హై యాక్షన్ థ్రిల్లర్ ‘ఫతే’ తో మనముందుకు రాబోతున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ జనవరి 2023లో సెట్స్ పైకి వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. అత్యంత ప్రభావంతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఢిల్లీ, పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ స్థాయిలో చిత్రీకరించనున్నారు. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశానికి కొరియోగ్రఫీ చేయడానికి లాస్ ఏంజిల్స్ నుండి ప్రత్యేక అంతర్జాతీయ సిబ్బందిని రప్పించనున్నారు.
ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. ఈ యాక్షన్ థ్రిల్లర్ సబ్జెక్ట్ విన్నప్పుడు నాకు చాలా థ్రిల్ ని కలిగించింది. ఈ సినిమాను 2023లో ప్రారంభం కానుందని.. ఆయన కూడా ఫస్ట్ షెడ్యూల్ కోసం ఎదురు చూస్తున్నాను తెలిపారు. అదేవిధంగా ఇది చాలా శ్రమతో కూడుకున్న చాలా విలువైన సబ్జెక్ట్ అని, ఈ సినిమా ద్వారా ఆయన కూడా చాలా విశయాల్లో నైపుణ్యం సాధించలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సోనూ సూద్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ హీరోహీరోయిన్లుగా వైభవ్ మిశ్రా దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సోనూ సూద్ , హిందీ, తెలుగు, తమిళం మరియు కన్నడ చిత్రాలలో ‘యువ’, ‘అతడు’, ‘ఆషిక్ బనాయా ఆప్నే’, ‘జోధా అక్బర్’, ‘కందిరీగ’, ‘షూటౌట్ ఎట్ వడాలా’ వంటి అనేక హిట్‌లను అందించారు, ‘ఆర్… రాజ్‌కుమార్’, ‘హ్యాపీ న్యూ ఇయర్’, ‘సింబా’ మరియు ‘కురుక్షేత్ర’, ఇతర వాటిలో అలరించి మెప్పించారు.
Also Read
- రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
- The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
- Kayadu Lohar: కయాదు వెనుక ఇంత కన్నీటి కథ ఉందా? 'ప్యారడైజ్' బ్యూటీ జర్నీ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!
- Ravi Teja: హిట్టు పడగానే రేటు పెంచేసిన మాస్ రాజా.. నిర్మాత డ్రాప్.. సంక్రాంతి సినిమా క్యాన్సల్ ?
తాజావార్తలు
-
SIR Notice: ఎల్కే అద్వానీకి SIR నోటీసులు..
-
రష్మికను ఇలా ఎప్పుడూ చూడలేదు.. MYSAA టీజర్లో యాక్షన్ పీక్స్!
-
Yogi Adityanath: హమీద్ అన్సారీ ‘హిందూ’ వ్యాఖ్యలపై యోగి ఘాటు కౌంటర్
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!