Actor Sivaji: వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. మొదటి నుంచి కూడా హౌస్ లో పెద్దన్న గా ఉంటూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఈ మధ్య #90’s సిరీస్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సిరీస్ తరువాత శివాజీ వరుస ఇంటర్వ్యూలు, ఎంటర్ టైన్మెంట్ షోస్ లలో పాల్గొంటున్నాడు. తాజాగా శివాజీ.. స్టార్ కమెడియన్ ఆలీ హోస్ట్ చేస్తున్న ఒక షోకు గెస్ట్ గా విచ్చేశాడు. ఇక ఆలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీ గెస్ట్ గా వస్తే.. వారు పుట్టిన దగ్గరనుంచి ఈరోజు వరకు వారి జీవితాల్లో జరిగిన సంఘటనల గురించి నిర్మొహమాటంగా అడిగేస్తాడు. ఈ ప్రోమోలో కూడా ఏవ్ అడిగి హైప్ తీసుకొచ్చాడు.
శివాజీని కూడా ఆలీ వదలలేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారిన ప్రయాణం నుంచి రాజకీయాలు, బిగ్ బాస్, #90’s సిరీస్ వరకు అన్ని ప్రశ్నలను అడిగేశాడు. సినిమాలకు దూరంగా ఉన్న సమయంలో #90’s సిరీస్ ఆఫర్ ఎలా వచ్చింది అన్న ప్రశ్నకు శివాజీ మాట్లాడుతూ.. ” చాలా కాలం తరువాత బాపినీడు గారిని కలవాలని వెళ్లాను. ఆ సమయంలోనే బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. అదే విషయం చెప్పాను. అదేం పర్లేదు. దాన్ని వదలకు అని చెప్పారు. ఆ తరువాత #90’s సిరీస్ రిలీజ్ అయ్యింది. ఈ సిరీస్ కోసం దాదాపు 5 లక్షల మంది సబ్ స్క్రైబ్ అయ్యారు” అని చెప్పుకొచ్చాడు. ఇక నువ్వు ఎవరు గుర్తుపట్టకూడదని మీసాలు, గెడ్డం తీసేసి దుబాయ్ లో తిరిగావంట ఎందుకు ..? అన్న ప్రశ్నకు శివాజీ మాట్లాడుతూ.. ” వేషం మార్చి దుబాయ్ లో పట్టుబడ్డ శివాజీ.. అసలు అప్పటికప్పుడే కోర్టులో అంతా జరిగిపోయింది.. ఇక్కడ వ్యాపారం చేయాలంటే రాజకీయం చేయాలనీ” చెప్పుకొచ్చాడు.
Also Read
- Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
- Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
- Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న 'చెన్నై లవ్ స్టోరీ' దర్శకుడు!
- Kaylee Hottle: హాలీవుడ్లో విషాదం.. ‘గాడ్జిల్లా వర్సెస్ కాంగ్’ ఫేమ్ కేలీ హాటిల్ కన్నుమూత
శివాజీ ఎందుకు దుబాయ్ లో పట్టుబడ్డాడు అన్న ప్రశ్న అసలు ఎందుకు వచ్చింది అంటే.. 2019 లోఅలందా మీడియా కేసులో శివాజీ పోలీసులకు పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. ఒక టీవీ ఛానెల్ వాటాల వ్యవహారంలో పోలీసు విచారణకు హాజరుకాకుండా అజ్ఞాతంలో ఉండటంతో ఆయనపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీచేయడంతో.. శివాజీ ఎవరి కంట పడకుండా ఉండడానికి గెడ్డం, మీసం తీసేసి దుబాయ్ వెళ్తున్న సమయంలో పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. ఇక దీనిపై శివాజీ ఎన్నోసార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. తాను ఇప్పటి వరకు 50సార్లు అమెరికా వెళ్లాలని లీగల్‌గా వెళ్లినందునే తనను ఎవరూ అడ్డుకోలేదని చెప్పారు. ప్రస్తుతం న్యాయస్థానం చెప్పినా తనను అమెరికాకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకుంటున్నారన్న శివాజీ.. అవన్నీ తప్పుడు కేసులేనని చెప్పుకొచ్చాడు. ఇవన్నీ శివాజీ రాజకీయాల్లో యాక్టివ్ గా ఉన్నప్పుడు జరిగాయి. ఆ తరువాత శివాజీ రాజకీయాలు, సినిమాలు వదిలేసి..కొంత గ్యాప్ తీసుకున్నాడు. అసలు ఈ సంఘటన గురించి శివాజీ ఏం చెప్తాడో తెలియాంటే ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.
తాజావార్తలు
-
Kalyani Priyadarshan: రణవీర్ సింగ్ ‘ప్రళయ్’లో కళ్యాణి ప్రియదర్శన్? బాలీవుడ్లో మరో పెద్ద అవకాశం దక్కనున్నదా!
-
Samsung Galaxy Z Flip 8: 4300mAh బ్యాటరీ, 50MP కెమెరాతో సామ్ సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 8 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
-
Chiranjeevi: నా అభిమానులు ఎస్కేఎన్, సాయి రాజేష్‌లను చూసి గర్వపడుతున్నా..
-
Delhi Protest : దేశ రాజధానిలో మళ్లీ రగిలిన ఉద్రిక్తతలు.. జంతర్ మంతర్ వద్ద రణరంగం.!
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!