Actor Sarathkumar Merges Party in BJP Amid Notices to Varalakshmi: నటుడు శరత్‌కుమార్ అకస్మాత్తుగా తన పాలిటికల్ పార్టీని బిజెపిలో ఎందుకు విలీనం చేశారు? అని రాజకీయ వర్గాలు చురుగ్గా విశ్లేషిస్తున్నాయి. బీజేపీతో పొత్తు పెట్టుకోనని, మతతత్వ రాజకీయాలకు ఎప్పటికీ మద్దతివ్వబోనని చెబుతూ వచ్చిన శరత్‌కుమార్ గత కొన్ని నెలలుగా బీజేపీతో పొత్తుపై చర్చలు జరుపుతున్నట్లు చెబుతున్నారు. కేంద్ర సహాయ మంత్రి ఎల్.మురుగన్ ఇటీవల ఆయనతో సమావేశమై.. పార్లమెంట్ ఎన్నికలకు బీజేపీతో పొత్తు ఖాయమైందని ప్రకటించారు. మరోపక్క ఆ వార్తలు మరువక ముందే మరికొద్ది రోజుల్లో తన సమత్వ పీపుల్స్ పార్టీని బీజేపీలో విలీనం చేసినట్లు ప్రకటించారు. దీనిపై శరత్‌కుమార్ వివరణ ఇస్తూ.. పార్టీ కార్యవర్గంతో చర్చించి దేశాభివృద్ధికి, భావి యువతకు మేలు జరిగేలా ఈ నిర్ణయం తీసుకున్నామని అంటూనే ప్రధాని మోదీ పాలనపై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే దీని వెనుక వేరే కారణం ఉందనే వాదన వినిపిస్తోంది. శరత్‌కుమార్ కుమార్తె వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఎన్‌ఐఏ నోటీసులు పంపింది. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో వరలక్ష్మి శరత్‌కుమార్ మాజీ అసిస్టెంట్ ఆదిలింగం అరెస్టయ్యాడు. అతనికి డ్రగ్స్, ఆయుధాల సరఫరాలో అంతర్జాతీయ డ్రగ్స్ ట్రాఫికర్లతో సంబంధాలున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.
Ananya Nagalla : రక్తం అమ్ముకుంటున్న అనన్య నాగళ్ల.. వైరల్ అవుతున్న వీడియో..
ఆదిలింగం నుంచి రూ.300 కేజీల హెరాయిన్, ఏకే 47 రైఫిల్, 9 ఎంఎం తుపాకులు, రూ.2,100 కోట్ల విలువైన మందు గుండు సామగ్రిని ఎన్ఐఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించగా.. డ్రగ్స్ సరఫరా ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆదిలింగం సినీ పరిశ్రమలో పెట్టుబడిగా పెడుతున్నారని గుర్తించారు. అందుకే ఆదిలింగం గతంలో పీఏగా పనిచేసిన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ను కూడా విచారించాలని ఎన్‌ఐఏ నిర్ణయించింది. ఈ విచారణకు వరలక్ష్మి శరత్‌కుమార్‌కు కూడా సమన్లు అందాయని, ఎన్‌ఐఏ విచారణకు హాజరు కావడానికి సమయం కావాలని ఆమె కోరినట్లు సమాచారం. ఈ క్రమంలోనే నటుడు శరత్‌కుమార్ తన పార్టీని బీజేపీలో విలీనం చేశారని అంటున్నారు. ఈ విషయంలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు చిక్కులు వచ్చే అవకాశం ఉందని భావించి శరత్‌కుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి శరత్ కుమార్ కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైన వరలక్ష్మి.. తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది. తెలుగులో తెనాలి రామకృష్ణ బీఏ బి ఎల్, క్రాక్, నాంది, వీర సింహారెడ్డి, హనుమాన్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించగా తమిళ్ ఇండస్ట్రీలో కూడా నటిగా సత్తా చాటుతోంది. ఆమె ఈ మధ్యనే రీసెంట్గా ఆమె ఎంగేజ్మెంట్ జరగగా త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్న క్రమంలో వరలక్ష్మికి ఇలా నోటీసులు అందడం హాట్ టాపిక్ అవుతోంది. కేసులో ఆమె పాత్ర ఉందని తెలిస్తే ఆమె అరెస్ట్ కి కూడా అవకాశం ఉన్న నేపథ్యంలో పార్టీ విలీనం జరిగిందని అంటున్నారు.