టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా తెరకెక్కిన లేలెస్ట్ మూవీ ‘తంత్ర’. దర్శకుడు శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన హారర్ మూవీ మార్చి 15న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ మరియు ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచుతోంది. హారర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు థ్రిల్ కలిగించనుంది.ఇందులో చాలా సీన్స్ భయపెట్టేలా ఉండబోతున్నాయని సమాచారం.. ఈ నేపథ్యంలో ఈ మూవీకి చిన్న పిల్లలు రాకూడదని మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఇక ‘తంత్ర’ సినిమాలో అనన్య పల్లెటూరి అమ్మాయిగా అలాగే క్షుద్రపూజలు ప్రయోగించబడిన బాధితురాలిగా కనిపించబోతోంది. పల్లెటూర్లలో క్షుద్రపూజలు, చేతబడులు ఎలా ఉంటాయి? అనేది మేకర్స్ ఈ సినిమాలో చూపించబోతున్నారు.‘తంత్ర’ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో చిద్రబృందం మూవీ ప్రమోషన్స్ లో జోరు పెంచింది. సినిమాపై ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచేలా కొత్త ప్రయోగాలు చేస్తోంది.
అందులో భాగంగానే అనన్యతో కలిసి ఓ కొత్త ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఇందులో అనన్య ఐస్ క్రీమ్ బండి మాదిరిగానే రక్తం బండి నడుపుతూ కనిపించింది. తాగండి తాజా తాజా ‘తంత్ర’ రక్తం అంటూ బోర్డు కూడా పెట్టుకుంది. “రక్తం, రక్తం, తాజా ‘తంత్ర’ రక్తం, టెన్ రుపీస్, ట్వంటీ రుపీస్” అంటూ వీధిలో కేకలు వేస్తూ వెళ్తుంది. అంతేకాదు, అక్కడున్న యువకుడిని తన బండి దగ్గరికి తీసుకొచ్చి, బలవంతంగా రక్తం తాగిస్తుంది. కచ్చితంగా థియేటర్లలో ‘తంత్ర’ సినిమా చూడాలని చెప్తుంది. ప్రస్తుతం ఈ ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. సినిమాపై ప్రేక్షకులలో ఆసక్తి కలిగించేందుకు చిత్రబృందం చేస్తున్న సరికొత్త ప్రయత్నాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.. అయితే కొందరు మాత్రం.. ‘‘అయ్యో పాపం అనన్యకు ఎంత కష్టం వచ్చింది, సినిమా ప్రమోషన్స్ కోసం రక్తం అమ్ముకుంటుంది.’’ అని కామెంట్ చేస్తున్నారు..