Actor Rajinikanth takes blessings of UP CM Yogi Adityanath: చాలాకాలం తర్వాత జైలర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ బ్యానర్ మీద కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమా దాదాపు 500 కోట్లు కొల్లగొట్టిందని అంచనా వేస్తున్నారు. అయితే ట్రేడ్ అనలిస్ట్ ల అంచనాలను తలకిందులు చేస్తూ వారు 400 కోట్లు కలెక్ట్ చేసిందని చెబితే నిర్మాణ సంస్థ మాత్రం 300 పాతిక కోట్లు మాత్రమే వసూలు చేసింది అని ప్రకటించి షాక్ ఇచ్చింద. ఇప్పుడు ట్రేడ్ అనలిస్ట్ లు ఏమో 500 కోట్లు కలెక్ట్ చేసిందని చెబుతున్నారు. అయితే మరి నిర్మాణ సంస్థ ఎంత చెబుతుందో తెలియదు. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే సినిమా రిలీజ్ కంటే ముందు హిమాలయాలకు వెళ్లిపోయిన రజినీకాంత్ అక్కడ నుంచి ఝార్ఖండ్ లోని మరో దేవాలయానికి వెళ్లి అక్కడ దర్శనం చేసుకున్నారు.
Bollywood: ఒకేసారి రెండు హిట్స్ కొట్టినా బాలీవుడ్‌కి నష్టాలేనా?
అక్కడి నుంచి ఉత్తర ప్రదేశ్ వెళ్లిన ఆయన అయోధ్య రాముడిని దర్శించుకునే అవకాశం కనిపిస్తోంది. అంతకంటే ముందే ఉత్తరప్రదేశ్ గవర్నర్ తో భేటీ అయిన ఆయన ఈరోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో కలిసి జైలర్ సినిమా వీక్షించారు. ఇక యోగి ఆదిత్యనాథ్ ని కలిసిన సమయంలో రజినీకాంత్ యోగి ఆదిత్యనాథ్ కాళ్ల మీద పడడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. ఈ విషయం మీద రకరకాల చర్చలు కూడా మొదలయ్యాయి. ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ వయసు 60 ఏళ్ల లోపే ఉంటుంది. అదే రజనీకాంత్ వయసు మాత్రం 72 ఏళ్లకు పైగానే ఉంది. అలా ఒక పెద్ద వయసు వ్యక్తి చిన్న వయసు వ్యక్తి కాళ్ళ మీద పడటం ఏమిటా? అని అందరూ ఆశ్చర్యపోతూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఒక ముఖ్యమంత్రి కావడం కంటే ముందే ఆదిత్యనాథ్ యోగిగా బాధ్యతలు చేపట్టారని అంటే అన్నింటిని వదిలేసి ఒక యోగిగా, సన్యాసిగా జీవితం గడుపుతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవాలని ఎవరైనా అనుకుంటారని అందుకు రజనీకాంత్ ఏమి మినహాయింపు కాదని అంటున్నారు.