Bollywood Suffering Losses after gadar 2 and OMG 2 hits: కరోనా తర్వాత కోలుకోని బాలీవుడ్ ఊపిరి పీల్చుకుందంటే.. అది గదర్2.. ఓ మై గాడ్2తోనే అని చెప్పక తప్పదు. ఆ మధ్యలో పఠాన్, ది కాశ్మీర్ ఫైల్స్ వంటి సినిమా హిట్ మూవీస్ వచ్చినా గదర్ 2.. ఓమైగాడ్ 2..ఈ రెండిటికంటే ముందే వచ్చిన తు ఝూటీ మై మక్కర్.. రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహానీవంటి వరుస హిట్స్‌తో హిందీ ఇండస్ట్రీ పూర్తిగా కోలుకుంది. నిజానికి పఠాన్ సినిమా మాదిరి హైప్ లేకపోయినా..గదర్2కు వస్తున్న కలెక్షన్స్ ట్రేడ్ వర్గాలకు షాక్ ఇస్తోంది. రిలీజైన మొదటిరోజే 40 కోట్లు రాబట్టి అందరి దృష్టిలో పడిన ఈ సినిమా మొత్తం 8 రోజుల్లో 304 కోట్ల నెట్ కలెక్ట్ చేయడం విశేషం.
Sohel: రీ రిలీజులపై సొహైల్ సంచలన కామెంట్స్.. చిన్న సినిమాలను బతికంచండని వేడుకోలు
మరోపక్క వరుస డిజాస్టర్స్‌తో ఉన్న అక్షయ్‌కుమార్‌కు ‘ఓ మై గాడ్2’ ఊపిరి పోసింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన ఓ మైగాడ్‌కు సీక్వెల్ కావడంతో హైప్ వుంటుందని అంచనాలు ఉన్నాయి. అక్షయ్ కుమార్ ఫ్లాపుల్లో ఉండడంతో ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమాకి ఓపెనింగ్స్ కూడా పెద్దగా లేవు. మొదటి రోజు 10 కోట్లు మాత్రమే కలెక్ట్ చేసినా పాజిటివ్ మౌత్ టాక్‌తో గదర్2 వంటి సునామీ పోటీ ఇచ్చినా తట్టుకుని మంచి వసూళ్లు రాబడుతూ 7 రోజుల్లో 85 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే గదర్ 2 సహా ఓ మై గాడ్2 కు హిట్ టాక్ వచ్చినా ఒకేసారి రిలీజ్ అవడంతో రెండు సినిమాల మేకర్స్ నష్టపోయారు. గదర్ 2 రిలీక్ కాకుంటే ఓ మైగాడ్2 ఇప్పటికే 150 కోట్లు కలెక్ట్ చేసేదని అంచనా.
ఈ సినిమాతో పోల్చుకుంటే.. గదర్2కు వచ్చిన నష్టం తక్కువే అయినా ఒకవేళ అది రాకుండా ఉంటె కనుక ఇప్పటికే కలెక్ట్ చేసిన 300 కోట్లతో పాటు మరో 20.. 30 కోట్లు అదనంగా వచ్చేదని అంచనా. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే గదర్ 2.. ఓ మైగాడ్ 2 లాంటి రెండు సాలిడ్ హిట్స్ ఉన్నా మూడో వారంలో అడుగుపెట్టిన ‘రాఖీ ఔర్ రాణీ కి ప్రేమ్ కహాని’కి కూడా కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ సినిమాకి ఇప్పటికీ వీకెండ్‌లో రెండు, మూడు కోట్లు కలెక్ట్ చేస్తూనే ఉంది. ఇలా రణీవీర్, అలియా జత కట్టగా.. కరణ్ జోహార్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పటికే 140 కోట్లు రాబట్టగా మూడోవారంలో పోటీ లేకుండా వుంటే.. 150 కోట్లు ఈజీగా దాటేసిదని అంచనా. హిట్ సినిమాలన్నీ ఒకేసారి వస్తే.. ఎంతో కొంత నష్టం తప్పదని కొంత గ్యాప్ తో వస్తే ఇబ్బందులు లేకుండా ఉంటాయని అంటున్నారు.