Actor Pradeep Felicitation to Chandrabose: ఆర్ఆర్ఆర్ సినిమాలో తాను రాసిన నాటు నాటు సాంగ్ కి గాను ఆస్కార్ అందుకున్న చంద్ర బోస్ ఆసియా ఖండంలో ఆస్కార్ అందుకున్న తొలి సినిమా పాటల రచయితగా నిలిచారు. 95 సంవత్సరాల తర్వాత ఇండియాకు మొట్టమొదటి సారిగా తెలుగు పాటకు ఆస్కార్ రావడం ఎంతో గొప్ప విషయమమొ భవిస్తూ జాతీయ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన చంద్రబోస్ ని ఘనంగా సత్కరించాలని ప్రముఖ సినీ నటుడు ప్రదీప్ ఆధ్వర్యంలో I FLY STATION నిర్ణయించింది. ఈ నెల ౩౦న సాయంత్రం 5:30 ని.లకు హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో చంద్రబోస్ కి ఘనంగా సన్మానం చేయనున్నారు.
Prabhas: ప్రభాస్ సలార్ దెబ్బ.. ఇక అవన్నీ డేట్స్ మార్చుకోవాల్సిందే!
కనుకుంట్ల సుభాష్ చంద్రబోస్ తాజ్ మహల్ సినిమా ద్వారా తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఆ తర్వాత బావగారు బాగున్నారా, పెళ్లి సందడి, ప్రేమంటే ఇదేరా, మాస్టర్ ఇలా ఎన్నో మంచి హిట్లు అందుకున్న స్టార్ హీరోల సినిమాల్లో పాటలు రాసి మంచి పేరు సంపాదించుకున్న చంద్రబోస్ గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలోని నాటు నాటు పాటతో మరోసారి ఆస్కార్ గెలుచుకొని వార్తల్లో నిలిచారు. ఇక సన్మాన కార్యక్రమంలో చంద్రబోస్ రచించిన గీతాల గురించి వారే స్వయంగా తమ మనసులోని మాటలను తెలియజేస్తూ ఆ పాటను ప్రముఖ గాయనీ గాయకులు గీతామాధురి, దీపు, పివిఎన్ఎస్ రోహిత్, సత్య యామిని, అతిథి భావరాజు, సాయి చరణ్ లతో పాడించనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి మురళీ మోహన్ , హీరో శ్రీకాంత్, సంగీత దర్శకురాలు శ్రీలేఖ, రచయిత రామజోగయ్య శాస్త్రి, ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి, ఐఏఎస్ ఆఫీసర్ ఇంతియాజ్ హాజరు కానున్నారు.