Actor Naresh: పవన్ టార్చ్ బేరర్.. చెడు చెవిలో చెప్పుకుందాం అంటూ నరేష్ ట్వీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actor Naresh Comments on janansenani Pawan Kalyan: జనసేనాని పవన్ కళ్యాణ్ గురించి సీనియర్ నటి విజయనిర్మల కుమారుడు, ప్రస్తుత నటుడు విజయ కృష్ణ నరేష్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సూపర్ స్టార్ కృష్ణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అయితే ఆ వ్యాఖ్యలు సరిగా లేవని మహేష్ బాబు అభిమానులు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారి తీసేలా చేశారు. ఈ విషయం మీద తాజాగా నరేష్ స్పందిస్తూ కృష్ణ ఒక మహానుభావుడని, ఆయన గురించి తప్పుగా మాట్లాడటం తగదని చెప్పుకొచ్చాడు. ఈ విషయం తెలిసి తాను షాక్ కి గురయ్యానని చెబుతూనే పవన్ మాటలు బాధించాయని చెప్పుకొచ్చాడు. ఏది ఎలా ఉన్నా పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో గెలిస్తేనే బావుంటుందని ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఏపీకి భవిష్యత్తు అనిపిస్తోందని చెప్పుకొచ్చాడు.
Salman Khan Firing: హోంశాఖకు ముంబై పోలీసుల లేఖ
Also Read
- Dhanush OM: రజినీ కోసం స్టార్ హీరో ధనుష్ బిగ్ డెసిషన్.. ‘జైలర్ 2’తో పోటీ వద్దంటూ సంచలన ప్రకటన!
- The Paradise: నాని కెరీర్లోనే రికార్డ్ ఓపెనింగ్ దిశగా ‘ది ప్యారడైజ్’.. రిలీజ్‌కు ముందే కోటి దాటేసిన సినిమా!
- Ram Charan: "మన కుటుంబాన్ని మార్చేసిన ఆ రోజును మర్చిపోలేం నాన్న" చిరంజీవిపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..
- Sumalatha: జానీ మాస్టర్ భార్య సుమలతపై దాడి?
అయితే అక్కడితో అయిపోయింది అనుకుంటే ఈరోజు కొద్దిసేపటి క్రితం మరోసారి పవన్ కళ్యాణ్ గురించి ట్వీట్లు చేశారు నరేష్. పవన్ కళ్యాణ్ ఏపీలో తెలుగు సినీ పరిశ్రమకు ఒక టార్చ్ బేరర్ అనేది వాస్తవం, గత పాలకులు తెలుగు సినీ పరిశ్రమకు చేసిన నష్టాన్ని భర్తీ చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక టార్చ్ బేరర్లా నిలుస్తాడని ఆయన ట్వీట్ చేశాడు. జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి భారీ ఎత్తున గెలవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిగా, ఒక సీనియర్ నటుడిగా సినీ పరిశ్రమ అంతా ఒక తాటి మీద ఉండాలని తాను పిలుపునిస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. మెగాస్టార్ గతంలోనే చెప్పారు మంచి ఉంటే మైక్ లో మాట్లాడదాం చెవిలో చెప్పుకుందాం అంటూ గతంలో మెగాస్టార్ చిరంజీవి చెప్పిన ఒక విషయాన్ని గుర్తు చేస్తూ ట్వీట్ ముగించారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ట్వీట్ కి ఎవరూ కామెంట్ పెట్టకుండా ఆయన రిస్ట్రిక్షన్స్ పెట్టారు.
The fact is that Mr Pawan Kalyan is the torch bearer, of our TFI in A.P to bring back the respect which was demolished by the past rulers . We pray for the massive victory of power star’s Jana Sena , Tdp & Bjp . As former president of MAA and as a veteran actor I appeal to…
— H.E AMB LTCOL SIR Naresh VK actor (@ItsActorNaresh) April 25, 2024
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!