Dhanush’s Raayan Gets A New Release Date: ధనుష్ కథానాయకుడిగా మరియు దర్శకత్వం వహించిన “రాయన్” అతని 50వ చిత్రంగా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ముందుగా, జూన్ 13న థియేట్రికల్‌గా విడుదల చేయాలనుకున్నారు, కానీ సినిమాల విడుదల తేదీలకు సంబంధించి తమిళ సినీ నిర్మాతల్లో చాలా గందరగోళం నడుస్తుంది. ఇంతకుముందు, తంగళన్ మరియు కంగువ విడుదల తేదీలు మారుతున్న క్రమంలో రాయాన్ త్వరగా భారీలోకి వస్తాడు అనుకున్నారు. కానీ జులై 12 కమల్ హాసన్ భారతీయుడు 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడంతో రాయన్ జూలై 26న విడుదలవుతుందని మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇక ఈ చిత్రాన్ని నిర్మాతలు, సన్ పిక్చర్స్, తమిళంతో పాటు, తెలుగు మరియు హిందీలో విడుదల చేయనున్నారు.
Also Read; Vettaiyan : తలైవా ‘వేట్టైయన్’ డిజిటల్ రైట్స్ పొందిన ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్..?
రాయాన్ కథ విషయానికి వస్తే ఒక యువకుడు రాయన్ తన కుటుంబం మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి హంతకులను వెతకడానికి వెళ్లడం. తన వ్యక్తిగత నష్టానికి కారణమైన వారిపై ప్రతీకారం ఎలా తీర్చుకున్నాడో అనే అంశం పైన సినిమా సాగనుంది. ఇక ఈ సినిమాకి AR రెహమాన్ సంగీతం అందించగా, ఓం ప్రకాష్ సినిమాటోగ్రఫీని నిర్వహించగా, ప్రసన్న GK ఎడిటింగ్ నిర్వహించారు. ఈ చిత్రంలో SJ సూర్య, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి మరియు వరలక్ష్మి శరత్‌కుమార్ తదితరులు ఉన్నారు.