తమిళనాడు సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కార్తీ కథానాయకుడిగా గతంలో సర్దార్ అనే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే తమిళంతో పాటు తెలుగులో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ సాధించింది. ఆ చిత్ర ఎండ్ లో సర్దార్ -2 ఉంటుందని ప్రకటించాడు దర్శకుడు. దాదాపు రెండు సంవత్సరాల క్రితం విడుదలైన ఈ చిత్రానికి కొనసాగింపుగా సర్దార్ -2ను ఇటీవల ప్రారంభించాడు దర్శకుడు పీఎస్ మిత్రన్ .
కాగా అందుతున్న సమాచారం ప్రకారం సర్దార్ -2 షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. పోరాట సన్నివేశాలు తెరకెక్కించే సమయంలో ఈ ఘటన జరిగింది. యాక్షన్ సీన్స్ తీస్తుండగా స్టంట్ మ్యాన్ ఎజుమలై దాదాపు 20 అడుగుల ఎత్తు నుంచి కిందపడి కిందపడి మృతి చెందాడు. మరో ఇద్దరు అసిస్టెంట్ స్టంట్ మ్యాన్ లకు గాయాలుయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్తీ షూటింగ్ స్పాట్ లో ఉన్నారని సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఎజుమలై మృతి చెందాడని వైద్యులు తెలిపారు. గతంలో భారతీయుడు -2 షూటింగ్ ప్రమాదంలో ఫైట్ మాస్టర్ మృతి చెందాడు. సర్దార్ షూటింగ్ ప్రమాదంతో తమిళ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. స్టంట్ మ్యాన్ ఎజుమలై మృతి పట్ల సంతాపం తెలియజేసింది యూనిట్. ఇటీవలటాలీవుడ్ లోను షూటింగ్ లో ప్రమాదాలు జరిగాయి.కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న దేవర షూటింగ్ లో తేనెటీగల దాడిలో దాదాపు 20 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు ఆసుపత్రి పాలయ్యారు.