సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం “అన్నాత్తే”. సిరుతై శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ లక్నోలో శరవేగంగా జరుగుతోంది. లక్నోలో ఒక చిన్న షెడ్యూల్ తర్వాత “అన్నాత్తే” షూటింగ్ పూర్తవుతుంది. ఈ చిత్రం దీపావళి 2021, నవంబర్ 4 న థియేటర్లలోకి రానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న “అన్నాత్తే”లో నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బు, ప్రకాష్ రాజ్ మరియు సూరి ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డి ఇమ్మాన్ స్వరకర్త. ఈ చిత్రంలో విలన్ గా సూపర్ స్టార్ రజినీతో తలపడడానికి ఓ పవర్ ఫుల్ నటుడికి ఎంపిక చేశారు మేకర్స్.
Read Also : భీమ్లా నాయక్ : మల్టీస్టారర్ ను సోలో హీరో మూవీ చేశారా ?
సౌత్ లో నెగెటివ్ పాత్రలను పోషించడంలో పేరు గాంచిన అభిమన్యు సింగ్ “అన్నాత్తే”లో విలన్ గా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్నీ స్వయంగా మేకర్స్ ప్రకటించారు. అభిమన్యు సింగ్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు. పవన్ కళ్యాణ్ “గబ్బర్ సింగ్” చిత్రంలో ఈయన విలన్ గా నటించాడు. ఇక తమిళ ప్రేక్షకులకు మాత్రం ఆయన సుపరిచితుడే. అభిమన్యు సింగ్ తెలుగు, తమిళం మాత్రమే కాకుండా హిందీ భాషలోనూ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో ముఖ్యమైన పాత్రలు పోషించాడు.