ఆమీర్ ఖాన్ కి ‘మిష్టర్ పర్ఫెక్షనిస్ట్’ అని పేరు! నటన పరంగా ఆయన గురించి మనం కొత్తగా చెప్పుకునేదేం లేదు. పర్ఫెక్ట్ పర్ఫామర్! అయితే, లుక్స్ విషయంలోనూ ఆమీర్ పర్ఫెక్షనిస్టే. పాత్ర కోసం ఎలా మారాల్సి వస్తే అలా మారిపోతాడు. ఓ సారి ఊరిపోతాడు. మరోసారి చిక్కిపోతాడు. అయితే, ‘ధూమ్ 3, పీకే’ సినిమాల్లో మాత్రం ఆమీర్ సూపర్ ఫిట్ గా కనిపించాడు. ఆ సినిమాల్లో కథ కోసం ఆయన అలా తయారవ్వాల్సి వచ్చింది. ఇంతకీ, ఖాన్ సాబ్ కండల వెనుక అసలు వ్యక్తి ఎవరో తెలుసా? ఆయన ట్రైనర్ డేవిడ్ పోజ్నిక్…
సెలబ్రిటీ ట్రైనర్ డేవిడ్ తన ఇన్ స్టాగ్రామ్ లో అప్పుడప్పుడు హై ప్రొఫైల్ వీడియోస్ షేర్ చేస్తుంటాడు. ఈసారి ఆమీర్ ఖాన్ వర్కవుట్ చూపించాడు. అయితే, సదరు ఓల్డ్ వీడియోలో మిష్టర్ పర్ఫెక్షనిస్ట్ తీవ్రంగా కష్టపడుతూ కనిపించాడు. ‘ధూమ్ 3’ కోసం ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ చేయించాడట డేవిడ్. ఈ వర్కవుట్ వల్ల చెస్ట్ పర్ఫెక్ట్ లుక్ సంతరించుకుంటుందట. ఇంకా చాలా లాభాలే ఉంటాయన్నాడు ట్రైనర్ సార్!
డేవిడ్ పోజ్నిక్ గురించి ఆమీర్ కూడా గతంలో మీడియా ముందు మాట్లాడాడు. ఆయన తనని ట్రైన్ చేసినప్పుడు కెరీర్ మొత్తంలోనే ది బెస్ట్ గా కనిపించానని అన్నాడు. ప్రస్తుతం ఆమీర్ ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు…