Aamir khan: అమిర్ ఖాన్ షాకింగ్ నిర్ణయం.. ఏకంగా అన్ని కోట్లు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aamir khan loose Rs 100crores: మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ గా పేరొందిన అమిర్ ఖాన్ ఇరవై ఎనిమిదేళ్ళ నాటి హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా ‘లాల్ సింగ్ చడ్డా’ అంటూ రీమేక్ చేశారు. బహుశా అమిర్ కు, ‘ఫారెస్ట్ గంప్’ హీరో టామ్ హ్యాంక్స్ కు పోలికలు ఉన్నాయని ఎవరైనా అన్నారేమో!ఈ సినిమా ఆగస్టు 11న జనం ముందు నిలచి, ఘోర పరాజయాన్ని చవిచూసింది. ‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ సినిమా వసూళ్ళతో పోల్చి చూస్తే హిందీలోకి డబ్ అయిన ‘ట్రిపుల్ ఆర్’, ‘కేజీఎఫ్-2’ చిత్రాలు భారీ మొత్తం పోగేసినట్టు ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు. ‘లాల్ సింగ్ చడ్డా’ హిందీ వర్షన్ మొదటి రోజు రూ. 11 కోట్లు పోగేయడానికే ఆపసోపాలు పడిందట. ఈ మొత్తం ‘ట్రిపుల్ ఆర్’ హిందీ వర్షన్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో అక్షరాలా సగం ఉందట.
మన సౌత్ సినిమాల్లో తప్పులు వెదుకుతూ పళ్లికిలించిన బాలీవుడ్ క్రిటిక్స్ ఇప్పుడు నాలుక్కరుచుకొని ‘తేలు కుట్టిన దొంగల్లా’ ఉన్నారు. అమిర్ ఖాన్ పైనే ఎంతోమంది బాలీవుడ్ ట్రేడ్ పండిట్స్ ఆశలు పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ‘బాహుబలి’ సిరీస్ ను అమిర్ నటించిన ‘ దంగల్’ బీట్ చేసిందని టముకు వేశారు. కానీ, కొందరు బాలీవుడ్ క్రిటిక్సే ఇది నిజం కాదనీ తేల్చారు. అదలా ఉంచితే, హిందీలో టాప్ టెన్ గ్రాసర్స్ లో ఆమిర్ ఖాన్ నటించిన రెండు చిత్రాలు ‘దంగల్, పీకే’ చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అమిర్ తాజా చిత్రం ‘లాల్ సింగ్ చడ్డా’ కూడా వసూళ్ళ వర్షం కురిపిస్తుందని బాలీవుడ్ బాబులు ఆశించారు. కానీ, మొదటి రోజునే వారి ఆశలపై ‘లాల్ సింగ్ చడ్డా’ నీళ్ళు చల్లడం గమనార్హం.
Also Read
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
- Telugu Actor: హీరో కాకముందు స్టేట్ క్రికెటర్.. ఆ యాక్టర్ కెరీర్లో ఎవరికీ తెలియని సీక్రెట్!
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
అయితే.. ఇప్పటికే భారీ నష్టాలను చవి చూసిన బాలీవుడ్ స్టార్ హీరో అమిర్ ఖాన్ ఇప్పుడు మరో నష్టాన్ని తన భుజాలపై వేసుకున్నారు. దీంతో.. ఈ సినిమా నష్టాన్ని తగ్గించడానికి తన పారితోషికాన్నీ వదులుకోనున్నారు. ఇక ‘లాల్ సింగ్ చడ్డా’ మొత్తం బడ్జెట్ రూ.180 కోట్లు కాగా ఆమిర్, అతడి మాజీ భార్య కిరణ్‌రావ్ ఈ సినిమాకు సహ నిర్మాతలుగా వ్యవహరించారు. దీంతో..ఈ సినిమా కోసం గత నాలుగేళ్లుగా వేరే ఏ చిత్రాన్నీ అమిర్ అంగీకరించలేదు..విక్రమ్ వేద లాంటి సినిమాలను సైతం వదులుకున్నారు. ఆగస్టు 11న విడుదలైన ‘లాల్ సింగ్ చడ్డా’ బాక్సాఫీస్ వద్ద దారుణంగా విఫలమయ్యింది. ఇప్పుడు ఆ చిత్రం మిగిల్చిన నష్టాలను పూడ్చడానికి ఆమిర్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకుగానూ అమిర్ రెమ్యూనరేషన్ రూ.50కోట్లు కాగా.. ఇప్పుడు ఆ మొత్తం సొమ్ముని వదులుకుని నిర్మాతలకు నష్టాన్ని తగ్గించాలనుకుంటున్నాడు. అమీర్ ఖాన్ ఈనిర్ణయంతో లాల్ సింగ్ చడ్డా చిత్రంపై మొత్తం రూ.100కోట్ల నష్టం వచ్చిందని టాక్.
Astrology : సెప్టెంబర్ 1, గురువారం దినఫలాలు
తాజావార్తలు
-
Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
-
CJP Protest: సీజేపీ నిరసన.. జంతర్ మంతర్ చుట్టూ ఇంటర్నెట్ షట్‌డౌన్!
-
Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
-
RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
-
Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు