బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్, కిరణ్ రావు దంపతులు కొన్ని నెలల క్రితం తమ వివాహ బంధానికి స్వస్తి చెప్పిన సంగతి తెలిసిందే. ఒక సినిమా షూటింగ్ సందర్బంగా ప్రేమలో పడ్డ వీరిద్దరు 2005 లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి ఆజాద్ బాబు అనే కుమారుడు ఉన్నాడు. తామిద్దరం పరస్పర ఒప్పందంతోనే విడాకులు తీసుకుంటున్నామని, తామెప్పుడూ స్నేహితులుగానే ఉంటామని తెలిపారు. అన్నట్లుగానే ఇద్దరు కలిసి ఒకే సినిమాకు వర్క్ చేస్తున్నారు.
ఇక తాజాగా ఈ ఇద్దరు మరోసారి భార్యాభర్తలుగా మారారు. కొడుకు ఆజాద్ పుట్టిన రోజును ఇతర కుటుంబ సభ్యులతో కలిసి అమీర్ ఖాన్ మరియు కిరణ్ రావులు గ్రాండ్ గా పార్టీ చేశారు. ఆజాద్ చిన్నపిల్లాడు కాబట్టి తనని బాధపెట్టడం ఇష్టంలేక అమీర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమీర్ , కిరణ్ రావుల మధ్య ఆజాద్ కేక్ కట్ చేస్తున్న ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.