ISIS: మహిళలపై అకృత్యాలకు ఐసిస్ ‘హ్యాండ్‌బుక్’.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- వెలుగులోకి ఐసిస్ దురాగతాలు..
- మహిళల్ని హింసించేందుకు ‘‘హ్యాండ్ బుక్’’..
- యజీదీ మహిళలపై అకృత్యాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ISIS: ఉగ్రవాద సంస్థ ఐసిస్ దురాగతాలు వెలుగులోకి వచ్చాయి. ముఖ్యంగా మహిళల్ని ఎలా హింసించాలి, వారిని ఎలా లైంగికంగా వేధించాలి అనే దానిపై ఏకంగా ఒక పుస్తకాన్నే రాసింది. ప్రజల్ని చంపడమే కాకుండా, మహిళల్ని బానిసలుగా చేసుకుని వారిని ఎలా చూడాలనే దానిపై లిఖితపూర్వక నియమాలను రూపొందించింది. ఆస్ట్రేలియా కోర్టులో ‘‘ఐసిస్ వధువు’’గా పిలువబడే మహిళ విచారణ సందర్భంగా ఈ ఉగ్రసంస్థ క్రూరత్వానికి సంబంధించిన పత్రాలను, హ్యాండ్ బుక్ వెలుగులోకి వచ్చాయి.
మహిళల్ని హింసించడానికి హ్యాండ్ బుక్:
ఖైదీలు, బానిసలకు సంబంధించి ప్రశ్నలు, సమాధానాలు కలిగిన ఒక పుస్తకాన్ని ఐసిస్ పరిశోధన, ఫత్వా విభాగం రూపొందించిందని కోర్టుకు తెలిపారు. మహిళల్ని బానిసలుగా మార్చడం, వారిని కొనడం, అమ్మడం, బహుమతిగా ఇవ్వడం, ఇతర వ్యక్తులతో మార్పిడి చేసుకోవడం, వారిపై అత్యాచారాలు చేయడం వంటి వాటిని ఈ పుస్తకంలో పొందుపరిచారు. మహిళా ఖైదీలను శిక్షించడం, వారితో వ్యవహరించే పద్ధతులను ఈ బుక్‌లో ప్రస్తావించారు.
Also Read
- Skirt: స్కర్ట్ నుంచి హిజాబ్ వరకు.. స్త్రీ శరీరంపై అధికారం ఎవరిది?
- US LPG Supply: భారత్‌కు ఎల్పీజీ సరఫరాలో అమెరికా సరికొత్త రికార్డు..
- Bangladesh: బంగ్లాదేశ్‌లో మరో హిందూ వ్యక్తి దారుణ హత్య.. డ్రమ్‌లో శవమై తేలిన వ్యాపారి
- India’s UNSC Permanent Seat Bid: భారత్ UNSC శాశ్వత సభ్యత్వానికి రష్యా మద్దతు.. UNGAలో లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు
యజీదీ మహిళలపై అకృత్యాలు:
ముఖ్యంగా యజీది మహిళల్ని బంధించడం, వారిపై అత్యాచారాలకు పాల్పడటం, బానిసలుగా చేయగాన్ని సమర్థించే ప్రయత్నాలు ఈ పత్రాలు, బుక్‌లో ఉన్నాయి. 2014లో ఆగస్టులో ఇరాక్‌లోని సింజర్ ప్రాంతంపై ఐసిస్ దాడులు చేసి, యజీదీ ప్రజలపై అకృత్యాలకు పాల్పడినట్లు కోర్టుకు తెలిపారు. ఈ దాడిలో వేల మరణించారు. సుమారు 6800 మంది యజీదీ మహిళలు, పిల్లల్ని ఐసిస్ బందీలుగా పట్టుకుందని అంచనా. వీరిలో చాలా మంది ఆచూకీ నేటికి తెలియలేదు. అధికారులు కోర్టుకు చెప్పిన దాని ప్రకారం.. పిల్లల్ని వివిధ మిలీషియాల మధ్య కొని అమ్మాలు. చాలా మందిని ఒక ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి తరలించారు. వీరిపై పదే పదే అత్యాచారాలకు పాల్పడ్డారు.
యజీదీ బాలికపై అరాచకాలు:
ఈ కేసు విచారణ సమయంలో యజీదీ బాలికపై జరిగిన వేధింపుల గురించి ప్రస్తావనకు వచ్చింది. 15 ఏళ్ల బాలికను ఐసిస్ ఉగ్రవాదులు ఆమె కుటుంబంపై దాడి చేసి, ఆమె తల్లి, సోదరుల్ని చంపి ఆమెను బందీగా పట్టుకున్నారు. బాలికను పలువురు పురుషుల మధ్య అమ్మారు. పదే పదే అత్యాచారాలకు పాల్పడ్డారు. చిత్ర హింసలకు గురిచేసినట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. ఆమెను ఆ తర్వాత ఒక కుటుంబం 10,000 అమెరికన్ డాలర్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఆ బాలికను ఇంటి పనులు చేయడానికి బంధించారని, పదే పదే అత్యాచారాలకు గురైందని, ఆమెకు స్వేచ్చగా తిరిగే అవకాశం ఇవ్వలేదని దర్యాప్తు అధికారులు ఆరోపించారు. యజీదీ మహిళల్ని కేవలం లైంగిక బానిసలుగా మాత్రమే చూసినట్లు కోర్టుకు వివరించారు.
తాజావార్తలు
-
Kishan Reddy: మేము ఓట్లను చోరీ చేయం.. ప్రజల మనసులను గెలుచుకుంటాం..
-
Aadhaar Biometric Update: ఆధార్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. ఆ ఫ్రీ అప్డెట్కు సెప్టెంబర్ 30 చివరి తేదీ!
-
CM Vijay: కరూర్ తొక్కిసలాటకు ఏడాది.. ‘ఎప్పటికీ మానని గాయం’ అంటూ సీఎం విజయ్ భావోద్వేగం
-
SS Rajamouli 25 Years: కథలు మారాయి, హీరోలు మారారు.. కానీ జక్కన్న ఆలోచన మాత్రం మారలేదు!
-
Pongal 2027 : ఇది అసలైన పోటీ అంటే.. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?