Aadikeshava Trailer: మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా ఎన్ శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆదికేశవ. సితార ఎంటర్ టైన్మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో మలయాళ నటుడు జోజు జార్జ్ విలన్ గా నటిస్తుండగా.. దాదా ఫేమ్ అపర్ణ దాస్ కీలక పాత్రలో నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. కామెడీ, రొమాన్స్ తో పాటు యాక్షన్ కూడా వేరే లెవెల్ ల్లో కుమ్మరించేశాడు డైరెక్టర్. సాధారణంగా ప్రతి సినిమాలో ఉండే అన్నదమ్ముల కథలనే ఈ కథ కూడా అనిపిస్తుంది.
Ashwin Babu: ఓంకార్ తమ్ముడు వేగం మాములుగా లేదుగా..
రాధికకు ఇద్దరు కొడుకులు. పెద్దోడు.. ఎవరితో మాట అనిపించుకోడు. చిన్నోడు అందరితో మాటలు పడుతూ అల్లరిచిల్లరగా తిరుగుతూ ఉంటాడు. ఇక చిన్నోడైన బాలు.. సరదాగా జీవితాన్ని గడుపుతున్న సమయంలో శ్రీలీల పరిచయం అవ్వడం.. ఆ పరిచయం ప్రేమగా మారడం జరుగుతుంది. ఇలా సరదాగా సాగిపోతున్న అతని జీవితంలో తన అన్న అనుకోని చిక్కులో పడినట్లు చూపించారు. అది జోజు జార్జ్ చేతిలో అతను చిక్కుకోవడం.. అన్నకోసం .. కదనరంగంలోకి బాలు అడుగుపెట్టడం చూపించాడు. అల్లరి చిల్లరగా తిరిగే బాలు.. రుద్రకాళేశ్వరుడి అవతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది..? బాలు అన్న ఎవరు.. ? అనేది సినిమాలో చూడాల్సిందే. ఇక సినిమాకు హైలైట్ అంటే జోజు జార్జ్ అనే చెప్పాలి. విలన్ గా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. ఉప్పెన తో ఎంతో వినయంగా కనిపించిన వైష్ణవ్ ఆదికేశవలో యాక్షన్ ఇరగతీసాడు. అస్సలు చివర్లో.. విలన్ కు నిప్పు పెట్టిన మంటతో సిగరెట్ వెలిగించి కూర్చోవడం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. జీవి ప్రకాష్ మ్యూజిక్ చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈ సినిమా నవంబర్ 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో వైష్ణవ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.