ఆది సాయికుమార్ హీరోగా చాగంటి ప్రొడక్షన్ లో నూతన చిత్ర ప్రారంభోత్సవం రామానాయుడు స్టూడియోస్ లో దసరా రోజున జరిగింది. శివశంకర్ దేవ్ ని దర్శకుడిగా పరిచయం చేస్తు అజయ్ శ్రీనివాస్ దీనిని నిర్మిస్తున్నారు. క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ గా రూపొందబోతున్న ఈ మూవీ ఆది సాయికుమార్ కెరియర్ లో ప్రత్యేకంగా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. సీనియర్ నిర్మాతలు కె. యస్. రామారావు , సురేష్ బాబు, లగడపాటి శ్రీధర్, పుస్కర రామ్మోహన రావు ఈ…