యంగ్ హీరో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆడవాళ్లు మీకు జోహార్లు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సినిమా టీజర్ ని బట్టి అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమైపోతుంది. టీజర్ విషయానికొస్తే .. “పెళ్లి అనేది ప్రతి మగాడి జీవితంలో ఒక అందమైన ఘట్టం.. కానీ ఇంట్లో పదిమంది ఆడాళ్ళు ఉండి ఒక అమ్మాయిని ఓకే చేయడమంటే ఇంచుమించు నరకం అంటూ శర్వా డైలాగ్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకొంది. పెళ్లి చేసుకోవాలనుకే శర్వాకు అతడి ఇంట్లో ఉన్న ఆడవారు వలన పిల్ల దొరకదు.. దీంతో శర్వా పెళ్లి ఎప్పుడు అవుతుంది అని ఎదురుచూస్తూ ఉండే సమయంలో అతడి జీవితంలోకి రష్మిక ఎంటర్ అవుతుంది.
ఆమె శర్వాని ఇష్టపడినట్లు చూపించారు. కానీ, చివర్లో శర్వా.. రశ్మికను మనం పెళ్లి చేసుకోలేము అంటూ షాక్ ఇస్తుంది.మరి రష్మిక ఎందుకు పెళ్లి చేసుకోలేనని చెప్పింది..? చివరికి శర్వాకు వివాహమైందా ..? అనేది ట్విస్ట్ గా చూపించి ఆసక్తిని పెంచేశారు. ఇక పెళ్లి కోసం ఆత్రుత పడే యువకుడిగా శర్వానంద్ జీవించేశాడు. ఇక ట్రెడిషనల్ లుక్ లో రష్మిక అదరకొట్టేసింది. మొత్తానికి ఈ టీజర్ వినోదాత్మకంగా చూపించారు. ఇక చివర్లో శర్వా నవ్వుకు చెప్పే అర్ధం ఆకట్టుకొంటుంది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ టీజర్ కు ఆహ్లాదకరమైన బీజీఎమ్ అందించారు. ఫిబ్రవరి 25 రిలీజ్ అవుతున్న ఈ చిత్రంతో శర్వా విజయాన్ని అదనుకుంటాడో లేదో చూడాలి.