Aa Okkati Adakku: పెళ్లి కాని వాళ్ళ పెయిన్ ఫీలయ్యి సినిమా చేశా.. డైరెక్టర్ ఇంటర్వ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Aa Okkati Adakku Director Malli Ankam Interview: అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమాను చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మీద అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపథ్యంలో దర్శకుడు మల్లి అంకం విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలు పంచుకున్నారు.
‘ఆ ఒక్కటీ అడక్కు’ క్లాసిక్ టైటిల్ కదా.. ఈ సినిమాకి పెట్టాలన్నపుడు బరువుగా అనిపించలేదా?
‘ఆ ఒక్కటీ అడక్కు’ ఈ కథకు యాప్ట్ టైటిల్. ఈ టైటిల్ పెట్టాలనే ఆలోచన కూడా నరేష్ దే. కేవలం టైటిల్ వరకే తీసుకున్నాం, ఈ కథకు, ఆ సినిమాకు సంబంధం లేదు. పెళ్లి చుట్టూ ఎలాంటి ఎమోషన్స్ వుంటాయి? కొందరు ఆ ఎమోషన్స్ ని ఎలా క్యాష్ చేసుకుంటారు? ఇలాంటి అంశాలని చాలా వినోదాత్మకంగా చూపిస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అయ్యేలా ప్రెజెంట్ చేశాం. ఇందులో వుండే కంటెంట్ అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. ఇది అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్.
Also Read
సందేశం ఏవైనా ఉందా ? -ప్రత్యేకంగా సందేశాలు ఉండవు కానీ.. పెళ్లి ఎప్పుడు? అని అడగడం కన్నా మీ దగ్గర ఏదైనా మంచి సంబంధం ఉంటే చూసి పెట్టండనే ఆలోచనని రేకెత్తించేలా ఈ సినిమా ఉంటుంది. అలాగే పెళ్లి సంబంధాల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా చూపించే ప్రయత్నం చేశాం.
నరేష్ ని ఎలా ఒప్పించారు ? –
నరేష్ నాలుగు సినిమాలతో బిజీగా వున్నారు. కామెడీ కథ అనేసరికి మొదట అంత ఉత్సాహం చూపించలేదు. నేను కథ చెప్పడం మొదలుపెట్టాను. ఫస్ట్ హాఫ్ విని షేక్ హ్యాండ్ ఇచ్చి ‘ఈ కథ మనం చేసేద్దాం’ అన్నారు. నాలుగు సినిమాల్లో రెండు వెనక్కి పెట్టి ఈ సినిమా ముందుకు తీసుకొచ్చారు. అంతలా ఈ కథ ఆయనికి నచ్చింది. ఇందులో కామెడీ తో పాటు చాలా మంచి ఎమోషన్ వుంది. నరేష్ గారి క్యారక్టరైజేషన్, పెర్ఫార్మెన్స్ ప్రేక్షకులని అద్భుతంగా అలరిస్తాయి.
ఈ కథకు స్ఫూర్తి ఉందా ? ఎలాంటి రీసెర్చ్ చేశారు ? –
సమాజంలో జరిగే సంఘటనలు నుంచి స్ఫూర్తి తీసుకున్న. నా ఫ్రెండ్స్ లో కొంతమందికి పెళ్లి కాలేదు. వారంతా ఒక వేడుకకు వచ్చినపుడు వేదికపైకి రాలేదు, కారణం అడిగితే.. అందరూ పెళ్లి గురించి అడుగుతారు. వారికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక రాలేదని చెప్పారు. అది నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. వాళ్ళ పెయిన్ ని ఫీలయ్యాను. అలాగే మ్యాట్రిమోనీకి సంబధించిన సంఘటనలు, పేపర్ లో వచ్చే కొన్ని వార్తలు కూడా ఆశ్చర్య పరుస్తున్నాయి. వీటన్నిటికీ ఫిక్షన్ జోడించి ఈ కథ చేయడం జరిగింది.
ఫస్ట్ కాపీ చూసిన తర్వాత నరేష్ రియాక్షన్ ఏమిటి ?
నరేష్ గారు ఫస్ట్ కాపీ చూసి చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇది వారి నాన్నగారి టైటిల్. ఖచ్చితంగా బాధ్యత మరింత ఉంటుంది. సినిమా చూసిన తర్వాత నమ్మకాన్ని నిలబెట్టాననే భావన ఆయనలో కనిపించింది. టీం అంతా అవుట్ పుట్ పై చాలా ఆనందంగా, నమ్మకంగా వున్నాం. సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ వాళ్ళు మంచి పాయింట్ చెబుతున్నారని చాలా హ్యాపీగా ఫీలయ్యారు. చాలా మందికి తెలియని విషయాలు చెబుతున్నారని అభినందించారు.
తాజావార్తలు
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
-
India’s First General Elections 1952: ఆనాడు ఎన్నికలు ఎలా జరిగాయో తెలుసా.?
-
Elon Musk Vs Ambani Starlink War : అంబానీతో మస్క్.. గొడవేంటి..?
-
Europe Calling: భారతీయుల చూపు యూరప్ వైపు ఎందుకు..?
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..