యంగ్ టైగర్ ఎన్టీఆర్, కమర్షియల్ సినిమాలకి కొత్త అర్ధం చెప్పిన కొరటాల శివ జనతా గ్యారేజ్ తర్వాత కలిసి చేస్తున్న సినిమా ‘దేవర’. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న దేవర సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలని ఆకాశం తాకేలా చేసారు ఫస్ట్ లుక్ తో. ఎన్టీఆర్ బ్లాక్ డ్రెస్ లో పవర్ ఫుల్ గా నిలబడి ఉండడంతో నందమూరి అభిమానులంతా ఖుషి అయ్యారు. 2024 ఏప్రిల్ 5న రిలీజ్ కానున్న దేవర సినిమా మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒకటి, పాన్ ఇండియా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు ప్రిడిక్ట్ చేస్తున్నాయి. షూటింగ్ స్టార్ట్ అవ్వడానికి లేట్ అయ్యింది కానీ ఒక్కసారి స్టార్ట్ చేసిన తర్వాత మాత్రం ఎన్టీఆర్-కొరటాల శివ అసలు స్లో అవ్వట్లేదు. గత నాలుగు నెలల్లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో దేవర షూటింగ్ ని చేస్తూనే ఉన్నారు.
హ్యూజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ముందు షూట్ చేసేసి సీజీ వర్క్స్ కి ఇచ్చేసి, ఆ తర్వాత టాకీ పార్ట్ షూట్ చేసుకోవాలి అనేది కొరటాల శివ ప్లాన్. అయితే కొంతమంది ఆర్టిస్టుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో దేవర లేటెస్ట్ షెడ్యూల్ కి బ్రేక్ పడింది. ఒక యాక్షన్ ఎపిసోడ్ ని కొరటాల శివ షూట్ చేయాల్సి ఉంది. ఈ షూటింగ్ లో పాల్గొనాల్సిన కొంతమంది యాక్టర్స్ డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. జులై 20 నుంచి నాలుగు రోజుల పాటు మళ్లీ షూటింగ్ చేయనున్నారు. ఈ గ్యాప్ ని అక్కడ ఫిల్ చేసి యాక్షన్ ఎపిసోడ్ ని కంప్లీట్ చేయాలనేది కొరటాల శివ ప్లాన్. ఏప్రిల్ 5 టార్గెట్ ని రీచ్ అవ్వడానికి కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ ఆ స్పీడ్ ని మైంటైన్ చేస్తూనే ఉన్నారు.