Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణ గురించి సినీ ప్రేక్షకుడుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అభిమానులకు ఆయనంటే ఎంతో పిచ్చో అస్సలు చెప్పాల్సినవసరం లేదు. కొట్టినా బాలయ్యే.. పెట్టినా బాలయ్యే.. ఆయనను చూడడానికి, తాకడానికి అభిమానులు రిస్కులు చేసారు. అవన్నీ కూడా వైరల్ గా మారాయి. అయితే ఇక్కడ ఒక బాలయ్య అభిమాని తన ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడు. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేది తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది. ఈ వీడియోలో వరద ముంపు ప్రాంతాలనుఅధికారులతో కలిసి బాలయ్య ప్రర్యవేక్షిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇక ఆయనను చూడడానికి అభిమానులు పోటెత్తారు.. అక్కడ నీటి కట్ట వరదల వలన ఒక వంతెన కుప్పకూలిపోయింది.
వంతెన ఒక సైడ్ కొంతమంది ప్రజలు ఉండగా.. మరో సైడ్ బాలయ్య ఉన్నాడు. మధ్యలో వరద నీరు పారుతోంది. ఇక వంతెన ముందు భాగంపై ఉన్న ఒక అభిమాని, తన అభిమాన హీరోను కలవాలని చెప్పి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదిలోకి దూకాడు.. ఈ ఒడ్డుకు రాలేక ఆ వరద నీటిలో కొట్టుకుపోయాడు. ఈ ఊహించని ఘటనతో అక్కడ ఉన్నవారందరూ భయబ్రాంతులయ్యారు. చివరకి సదురు అభిమానిని మరికొందరు కాపాడినట్లు తెలుస్తోంది. అభిమాన హీరోను చూడడం కోసం కొన్ని రిస్క్ లు చేసినా పర్లేదు కానీ ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకొనే పనులు చేయకూడదని ఈ వీడియో చూసిన వారు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.