A Book On Roja Life Inagurated by Bhumana and Ambati: ఒకప్పటి హీరోయిన్, మంత్రి రోజాకు సంబంధించి జీవిత చరిత్ర బుక్‌ను తాజాగా విడుదల చేశారు. ‘రంగుల ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి’ అనే పేరుతో రోజా జీవిత చరిత్ర రాశారు. ఈ బుక్‌ను అంబటి రాంబాబు, భూమన కరుణాకర్ రెడ్డిలు విడుదల చేశారు. ఇక ఈ వేడుకలో రోజా భర్త, తమిళ దర్శకుడు సెల్వమణితో పాటు సినీ గాయకుడు మనో కూడా పాల్గొన్నారు. మంత్రి రోజా అసలు పేరు శ్రీలత రెడ్డి నటన మీద ఆసక్తితో మాజీ ఎంపీ శివప్రసాద్ ప్రోత్సాహంతో ఆమె సినీ రంగ ప్రవేశం చేశారు రోజా గా పేరు మార్చుకుని తెలుగు తమిళ సినిమాల్లో హీరోయిన్ గా సత్తా చాటారు. ఇక తమిళ దర్శకుడు ఆర్కే సెల్వమణిని ప్రేమించి వివాహం చేసుకున్న ఆమె తర్వాత కూడా తల్లి, అత్త పాత్రలలో కనిపించారు.
Radhika: బీజేపీ ఎంపీగా రాధిక.. అక్కడి నుంచే పోటీ
ముందు నుంచి ఆమె పొలిటికల్ గా యాక్టివ్గా ఉంటూ వచ్చారు. తొలుత తెలుగుదేశం పార్టీ నుంచి ఆమె రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కాంగ్రెస్లో చేరదామనుకునే సమయంలో వైఎస్ మరణంతో వెనుతిరిగిన రోజా వైయస్ జగన్ కొత్త పార్టీ పెట్టిన తర్వాత ఆయన వెంటే నడిచాడు. ఇక 2014 సంవత్సరంలో నగరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. రెండోసారి అదే నియోజకవర్గంలో నుంచి 2019లో పోటీ చేసి మరోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ప్రస్తుతం జగన్ క్యాబినెట్లో ఆమె టూరిజం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్న ఆమెకు మూడోసారి కూడా నగరి నుంచి ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది పార్టీ. దీంతో ఆమె మరోసారి అక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు