కంగనాపై చర్యలు… 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు డిమాండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
1947లో భారత స్వాతంత్య్రంపై వివాదాస్పద ప్రకటన చేసినప్పటి నుంచి కంగనా రనౌత్ పలువురి ఆగ్రహానికి గురవుతూనే ఉంది. 1947లో భారత్‌కు లభించిన స్వాతంత్య్రాన్ని బ్రిటీష్ వారు భిక్షగా దేశానికి అందించారని కంగనా చేసిన కామెంట్స్ పై 91 ఏళ్ల స్వాతంత్ర్య సమరయోధురాలు లీలాబాయి మండిపడ్డారు. కంగనాపై చర్యలు తీసుకోవాలని ఆమె ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. కంగనా ప్రకటనను దేశద్రోహ చర్యగా పేర్కొన్నారు లీలాబాయి.
ఆమె మాట్లాడుతూ.. “నా పేరు లీలా చితాలే. నాకు 91 ఏళ్లు. దేశానికి భిక్షగా స్వాతంత్య్రం వచ్చిందని కంగనా రనౌత్ అనే మహిళ చెప్పినట్లు వార్తలు పదే పదే ప్రసారం కావడం చూశాను. ఆ మహిళకు రాష్ట్రపతి పద్మశ్రీ అందజేశారు. అది చూసిన తర్వాత నాకు విపరీతమైన కోపం వచ్చింది.నాకు 12 ఏళ్ల వయసులో గాంధీజీతో పాటు ఇంగ్లీషు విద్యను బహిష్కరించాలని డిమాండ్ చేసి ఒకరోజు జైలుకు వెళ్లాను. మాలాంటి వ్యక్తులు దాని కోసం శ్రమించిన, మేము చూసిన, మేము అనుభవించిన ప్రజల త్యాగాన్ని గుర్తించకుండా, ఈ మహిళ ‘భిక్ష’తో ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని చెప్పింది. ఈ ప్రకటనను నేను ఖండిస్తున్నాను. ఆమెకు బుద్ధి చెప్పాలని నేను మన గౌరవనీయమైన ప్రధానిని అభ్యర్థిస్తున్నాను. ఆమెను జైలులో పెట్టమని నేను మిమ్మల్ని అడగడం లేదు, కానీ ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలి. దీన్ని దేశద్రోహం అంటారు. భిక్షతో మనకు స్వాతంత్ర్యం వచ్చిందని యువతకు చెబితే, వారు దాని గురించి ఏమనుకుంటారు? దేశ భవిష్యత్తు ఏమిటి? కాబట్టి ఈ ఆలోచన వ్యాప్తి చెందకుండా, ఆమెపై చర్య తీసుకోవాలి’ అంటూ ఆమె ప్రధానిని డిమాండ్ చేశారు.
Also Read
- Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న 'ఆమె' కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
- Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
Read Also : హీరో సూర్యకు భద్రత… ఇంటి వద్ద హై సెక్యూరిటీ
కొన్ని రోజుల క్రితం ఓ మీడియా ఇంటరాక్షన్ లో కంగనా మాట్లాడుతూ.. భారత్‌కు నిజమైన స్వాతంత్ర్యం 2014లోనే లభించిందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఆమె వ్యాఖ్యలపై మండిపడుతూ పలువురు రాజకీయ నాయకులు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె ప్రకటన దేశం కోసం తమ ప్రాణాలను అర్పించిన స్వాతంత్ర్య సమరయోధులందరి త్యాగాలను అవమానించేలా ఉందని, ఆమెకు ఇటీవల లభించిన పద్మశ్రీ అవార్డును రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఆమె తనను తాను సమర్థించుకుంది. తాను తప్పు అని నిరూపిస్తే తన పద్మశ్రీని తిరిగి ఇస్తానని సవాల్ చేసింది. కంగనా పద్మశ్రీ అవార్డును అందుకున్నప్పటి నుంచి జరుగుతున్న ఈ వివాదం ఎప్పుడు, ఎలా సద్దుమడుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
Bollaram Incident: ఉద్యోగంలో నుంచి తీసేశాడని కక్ష.. చిన్నారి కిడ్నాప్, హత్య..
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Rahul Gandhi: ఢిల్లీ ఎందుకు నిర్బంధంలో ఉంది.. శాంతియుత నిరసనను ఎందుకు అడ్డుకుంటున్నారు?
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!