స్టార్ హీరోయిన్ కావాలంటే తెలుగులో నటించాల్సిందే. అలా చేస్తేనే స్టార్‌డమ్ దక్కుతుందని సంయుక్త మీనన్ కూడా నిరూపించింది. స్టార్‌డమ్మే కాదు. విచిత్రంగా స్టార్స్‌తో ఒక్కరితో జత కట్టకపోయినా క్రేజీ పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది సంయుక్త. ఏదో అరకొర సినిమాతో సరిపెట్టుకోవడం లేదు. ఏకంగా 9 సినిమాలు చేస్తోంది. అందులో 7 సినిమాలు పాన్ ఇండియా సినిమాలు కావడం గమనార్హం.
Also Read : Kollywood : AVM స్టూడియోస్ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత
మలయాళం నుంచి వచ్చిన సంయుక్త మీనన్ భీమ్లా నాయక్‌తో తెలుగు వాళ్లకు పరిచయమైంది. ఆతర్వాత వరుస ఆఫర్స్‌తో బిజీ కావడమే కాదు.. ఈ అమ్మడు నటిస్తే సినిమా హిట్ అన్న పేరు తెచ్చుకుంది. సార్.. బింబిసార.. విరూపాక్ష వంటి కంటిన్యూస్ హిట్స్‌తో లక్కీ హీరోయిన్ అయిపోయింది సంయుక్త. మలయాళంలో 15 సినిమాలు చేసినా రాని క్రేజ్ ‘భీమ్లానాయక్ ‘ తీసుకుంది. ఆతర్వాత తమిళం, కన్నడలో నటించే ఛాన్స్ అందుకున్న సంయుక్త టాలీవుడ్ పేరు చెప్పి ‘ మహారాగిణి’ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. సంయుక్త మీనన్ ప్రస్తుతం తెలుగులో ‘స్వయంభు’లో నిఖిల్‌తో ‘నారి నారి నడుమ మురారి’లో శర్వానందన్ తో ‘హైందవ’లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో జత కడుతోంది. సౌత్‌లో కన్నడ మినహా తెలుగు, తమిళం మలయాళంలో నటిస్తోంది. ‘రామ్ మూవీలో మోహన్‌లాల్‌తో జత కడుతూ మలయాళంలోకి ఎంట్రీ ఇస్తోంది. తమిళంలో బెంజ్ మూవీలో నటిస్తోంది. బాలకృష్ణతో కలిసి యాడ్స్‌లో నటించిన సంయుక్త ‘అఖండ2’లో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. పూరీ తీస్తున్న బైలింగ్వల్ మూవీలో విజయ్ సేతుపతితో నటించే ఛాన్స్ కొట్టేసింది. సంయుక్త మీనన్ కూడా లేడీ ఓరియెంటెడ్ జానర్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె నటిస్తున్న ఉమెన్ సెంట్రిక్ మూవీకి ‘ది బ్లాక్ గోల్డ్’ అన్న టైటిల్ పెట్టారు. పోస్టర్ చూస్తుంటే.. యాక్షన్ హీరోయిన్‌లా కనిపిస్తోంది సంయుక్త. చేతిలో 9 సినిమాలు అందులో 7 పాన్ ఇండియా మూవీస్ చేస్తున్న రికార్డ్ ఈ అమ్మడి సొంతం.