టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ స్టోరీస్ అనగానే అందరికీ గుర్తొచ్చే సినిమా #7G బృందావన్ కాలనీ. ఒక అడల్ట్ సినిమాగా, హీరోయిన్ బాడీ ఆబ్జక్టిఫయ్యింగ్ తో స్టార్ట్ అయ్యే ఈ సినిమా సడన్ గా ఎమోషనల్ రైడ్ గా మారి ఫ్యామిలీ మొత్తం కలిసి కూర్చోని చూసే సినిమాగా మారిపోతుంది. ఆ గ్రాఫ్ ని, సినిమా ఛేంజ్ అయిన విధానానికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. తెలియకుండానే ఫ్యామిలీ డ్రామా లోకి వెళ్లిపోయిన #7G బృందావన్ కాలనీ సినిమా క్లయిమాక్స్ కి వచ్చే సరికి కంటతడి పెట్టించేస్తది. హిలేరియస్ కామెడీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎమోషన్స్, హీరో-హీరోయిన్ సూపర్బ్ లవ్ ట్రాక్, ఇప్పటికీ వినాలనిపించే సాంగ్స్… #7G బృందావన్ కాలనీ సినిమాని ఒక కల్ట్ క్లాసిక్ స్టేటస్ గా నిలబెట్టాయి.
సెల్వరాఘవన్ సినిమాటిక్ బ్రిలియన్స్ #7G బృందావన్ కాలనీ సినిమాలో కనిపిస్తుంది. 2004లో రిలీజ్ అయిన ఈ మూవీని రీరిలీజ్ ట్రెండ్ లో భాగంగా మేకర్స్ గ్రాండ్ గా రీరిలీజ్ చేసారు. ఈరోజు థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీని మళ్లీ థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయడానికి యూత్ థియేటర్స్ కి క్యూ కడుతున్నారు. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడుపోవడంతో అన్ని థియేటర్స్ కంప్లీట్ గా ప్యాక్ అయిపోయాయి. డైలాగ్స్ ని, సాంగ్స్ ని థియేటర్స్ లో కూర్చున్న వాళ్లు ఎంజాయ్ చేస్తూ… రిపీట్ చేస్తున్నారు. క్లైమాక్స్ కి ప్రతి ఒక్కరూ 19 ఏళ్ల క్రితం ఎంతగా ఎమోషనల్ అయ్యారో ఇప్పుడు కూడా అంతే ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నారు. మరి నెక్స్ట్ ఇయర్ #7G బృందావన్ కాలనీకి సీక్వెల్ వస్తుందని మేకర్స్ అనౌన్స్ చేసారు, ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.