2021వ సంవత్సరానికి గుడ్ బై చెప్పే రోజు వచ్చేసింది. అదే సమయంలో 2022కు స్వాగతం చెప్పడానికి ఫిల్మ్ లవర్ రెడీ అవుతున్నారు. విశేషం ఏమంటే… ఈ యేడాది జనవరి 1వ తేదీ ఆరు సినిమాలు విడుదలయ్యాయి. అలానే ఈ యేడాది చివరి రోజున అంటే శుక్రవారం డిసెంబర్ 31న కూడా సరిగ్గా ఆరు సినిమాలు జనం ముందుకు వచ్చాయి.
Read Also : సినిమా టిక్కెట్ రేట్ల నిర్ణయ కమిటీ తొలి భేటీ పూర్తి!
శ్రీవిష్ణు నటించిన ‘అర్జున ఫల్గుణ’తో పాటే నాగవర్మ, దివ్యా సురేశ్ జంటగా నటించిన ‘విక్రమ్’, సోనియా అగర్వాల్ నటించిన ‘డిటెక్టివ్ సత్యభామ’, తమిళ అనువాద చిత్రం ‘అంతఃపురం’, హాలీవుడ్ మూవీ ‘ది టెన్ కమాండ్ మెంట్స్’ చిత్రాలు శుక్రవారం రిలీజ్ అయ్యాయి. అలానే రాజేంద్ర ప్రసాద్ తొలిసారి నటించిన ఓటీటీ మూవీ ‘సేనాపతి’ ఆహాలో శుక్రవారం నుండి స్ట్రీమింగ్ అవుతోంది. ఇక శనివారం… అంటే జనవరి 1వ తేదీన రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘ఆశ’, వరుణ్ సందేశ్ ‘ఇందువదన’ చిత్రాలు విడుదల కాబోతున్నాయి. ఇదిలా ఉంటే… రానా నటించిన ‘1947’ మూవీ విడుదలను చివరి నిమిషంలో నిర్మాత సి. కళ్యాణ్ వాయిదా వేశారు. పెద్ద సినిమాల విడుదల అనంతరం సంక్రాంతి తర్వాత దీనిని రిలీజ్ చేస్తామని కళ్యాణ్ చెబుతున్నారు.