యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న డైలాగ్ డెలివరీ ఇండియాలో సగం మంది హీరోలకి ఉండదు. అందుకే రాజమౌళి అంతటి దర్శకుడు ఇండియాస్ బెస్ట్ యాక్టర్స్ లో ఎన్టీఆర్ ఒకడు, కొమురం భీముడో సాంగ్ లో ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ వరల్డ్ లో ఏ యాక్టర్ చెయ్యలేడు అని చెప్తూ ఉంటాడు. పర్ఫెక్ట్ పిచ్ లో డైలాగ్ చెప్పే ఎన్టీఆర్ కి, మాటల మాంత్రికుడిగా పేరు తెచ్చుకున్న త్రివిక్రమ్ కలిస్తే ఎలా ఉంటుంది? ఈ ఇద్దరూ కలిసి ఎలాంటి సినిమా చేస్తారు? త్రివిక్రమ్ మాట ఎన్టీఆర్ నుంచి ఎలా పేలుతుంది? ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ సెట్ అయితే చూడాలని కొన్ని సంవత్సరాలుగా కోరుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అండ్ త్రివిక్రమ్ ఫ్యాన్స్. వారి కోరికని నిజం చేస్తూ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసి చేసిన సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’.
ఫ్యాక్షన్ సినిమాలు అనగానే కొట్టు కోవడం, నరుక్కోవడం మనం చాలా సినిమాల్లో చూసాం కానీ అరవింద సమేత వీర రాఘవ సినిమా అందుకు పూర్తిగా భిన్నం. యుద్ధం జరిగిన తర్వాత పరిణామాల పైన… పోస్ట్ వార్ పైన ఈ సినిమా ఉంటుంది. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్, అంతే ఇంటలెక్చ్యువల్ రైటింగ్, సోల్ ఫుల్ మ్యూజిక్, థాట్ ప్రవోకింగ్ క్లైమాక్స్ అన్నీ కలిసి అరవింద సమేత వీర రాఘవ సినిమాని స్పెషల్ గా మార్చాయి. సెటిల్డ్ గా ఎన్టీఆర్ చేసిన పెర్ఫార్మెన్స్ ముందెన్నడూ చూడని ఎన్టీఆర్ ని పరిచయం చేస్తుంది. ఇంట్రో సీన్ ని త్రివిక్రమ్ డిజైన్ చేసిన విధానం చూస్తే త్రివిక్రమ్ లో ఇంత మాస్ డైరెక్టర్ ఉన్నాడా అని ఆశ్చర్యపోవాల్సిందే. ఈ క్లాసిక్ రిలీజ్ అయ్యి నేటికి ఐదేళ్లు అవ్వడంతో, ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. #5YearsForAravindaSametha #NTR ట్యాగ్స్ నెట్ లో వైరల్ అవుతున్నాయి. క్లాస్-మాస్ ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవనుంది… హారిక హాసినీ బ్యానర్ పై స్టార్ట్ అవనున్న ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతం… ఎన్టీఆర్ కి త్రివిక్రమ్ కి ఉన్న లైనప్ కంప్లీట్ కాగానే మొదలవనుంది.
5 years since the epic tale of #AravindaSametha unfolded on the big screen! 🔥
Thank you for all the love & support! ❤️#5YearsForAravindaSametha 💥@tarak9999 #Trivikram @hegdepooja @MusicThaman @vamsi84 pic.twitter.com/EKomuWbcPi
— Haarika & Hassine Creations (@haarikahassine) October 11, 2023