మోహన్ లాల్ ఆనందానికి హద్దులే లేవు. ఆ ఫీల్ ఎంజాయ్ చేయడానికి కాస్త గ్యాప్ కూడా దొరకడం లేదు. ఒకదానికొకటి సర్ప్రైజ్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది భారీ డిజాస్టర్స్ చవిచూసిన లాలట్టన్‌కు ఈ ఇయర్ మెడిసన్ అయ్యింది. 2025 ఆయనకు సో స్పెషల్‌గా మారింది. మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ మరో హిట్ కొట్టేశారు. ఆయన నటించిన హృదయ పూర్వం వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. లోక మేనియాను తట్టుకుని ఈ మార్క్ సాధించారు లాలట్టన్. ఆగస్టు 28న రిలీజైన హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ కొట్టేయడమే కాదు హ్యాట్రిక్ హండ్రెడ్ క్రోర్ ఫిల్మ్ సాధించిన తొలి మాలీవుడ్ హీరోగా మారారు. ఒక్క ఏడాదిలోనే ఈ ఫీట్ సాధించగా రూ. 600 కోట్ల మార్కెట్ క్రియేట్ చేసిన నటుడిగా గుర్తింపు దక్కించుకున్నారు.
లాస్ట్ ఇయర్ భారీ బడ్జెట్, ప్రయోగాత్మక చిత్రాలు చేసి దెబ్బతిన్నారు మోహన్ లాల్. మలైకొట్టై వాలిబన్, స్వీయ దర్శకత్వం వహించిన బర్రోజ్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం పాలయ్యాయి. బర్రోజ్ ఒక్కటే వంద కోట్లకు పైగా నష్టాన్ని తెచ్చిపెట్టింది. రూ. 150 కోట్ల పెట్టి బొమ్మ తీస్తే రూ. 20 కోట్లను కూడా రాబట్టుకోలేకపోయింది. ఈ రెండు ప్లాపులతో కాస్తంత తడబడినా , ఈ ఏడాది వరుస హిట్స్ కొట్టేసి లాస్ట్ ఇయర్ లెక్కలన్నీ సరి చేశారు. హ్యాట్రిక్ హిట్స్ ఎంజాయ్ చేస్తున్న లాలెట్టన్‌కు మరో సర్ ప్రైజ్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాదా సాహెబ్ అవార్డును ప్రకటించి సత్కరించింది. ఇదే ఆనందంలో దృశ్యం3ని కూడా స్టార్ట్ చేసేసిన మోహన్ లాల్.. నెక్ట్స్ వృషభ మూవీని లోడ్ చేస్తున్నారు. ఈ దీపావళి సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేస్తే కంప్లీట్ స్టార్‌కు 2025 కంప్లిట్ హిట్ ఇయర్ గా మిగులుతుంది.