2018 Movie: ఒక భాషలో వచ్చిన సినిమా మంచి విజయాన్ని అందుకుంది అంటే.. దాన్ని మరో భాషలోకి అనువదించడం సాధారణమే. ముఖ్యంగా వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమాలకు ప్రేక్షకులు ఎప్పుడు బ్రహ్మరధం పడతారు. ఈ మధ్య రిలీజ్ అయిన ది కేరళ స్టోరీ సినిమానే అందుకు నిదర్శనం. ఇక ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మరో మలయాళ మూవీ 2018 సినిమా కూడా సెన్సేషన్ క్రియేట్ చేసింది. కుంజుకో బాబిన్, టోవినో థామస్, అసిఫ్ ఆలీ, వినీత్ శ్రీనివాసన్, అపర్ణ బాలమురళి.. ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన ఈ సినిమాకు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించాడు. 2018 లో కేరళలో వచ్చిన వరదలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మరెంతోమంది జీవనాధారాన్ని కోల్పోయారు.. ఇంకెంతోమంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి వరద అంతకుముందు ఎప్పుడు రాలేదని చెప్పాలి. ఇక ఈ వాస్తవిక సంఘటన ఆధారంగా తెరకెక్కిన సినిమానే 2018. మే 5 న రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.
NTR30: టైటిల్ కన్నా క్యాప్షన్స్ తోనే భయపెడుతున్నారు కదయ్యా
ఇక ప్రస్తుతం 100 కోట్ల క్లబ్ లో చేరడానికి అతి దగ్గర ఉన్న ఈ చిత్రం తెలుగులో కూడా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు ట్రైలర్ నుమేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. కేరళలో చుక్కనీరు లేని సమయంలో 26 ఏళ్ల తరువాత ఇడుక్కి అనే డ్యామ్ ను తెరవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తోంది. ఇక అదే సమయంలో కేరళను వరదలు ముంచెత్తుతాయి. ఇక అప్పటి నుంచి అక్కడ ఉన్న ప్రజలు, ప్రభుత్వం, మీడియా.. ఎలా ఆ వరదలతో పోరాడారు. అప్పుడు ఉన్న కేరళ స్థితిగతులు ఏంటి..? ప్రభుత్వం… ప్రజల కోసం ఎలాంటి నిర్ణయాలను తీసుకుంది..? అనేది సినిమా కథగా తెలుస్తోంది. ట్రైలర్ ను మొత్తం చాలా గ్రిప్పింగ్ గా కట్ చేశారు. ఆ వరదలు.. అందులో చిక్కున్నవారు.. వారిని కాపాడడానికి ప్రభుత్వం పంపిన హెలికాఫ్టర్ లు.. ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం.. ఇలా మొత్తం కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఈ సినిమా మలయాళ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. మరి తెలుగులో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకోనున్నదో చూడాలి.