మాళవిక మోహనన్.. ‘మాస్టర్’ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి అమ్మడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యేవారికి ఆమె అందాల విందు గురించి ఇంట్రడక్షన్ ఇవ్వాల్సిన పని లేదు. అందాలను ఎరగా వేసి కుర్రాళ్లను ఎలా వలలో వేసుకోవాలో ఈ భామకు తెలిసినట్లు మరెవ్వరికీ తెలియదనే చెప్పాలి. ఇటీవల పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న ఈ భామ ప్రస్తుతం మాల్దీవుల్లో చిల్ అవుతుంది. నార్మల్ గానే అమ్మడు అందాల ఆరబోతను తట్టుకోలేం.. ఇక మాల్దీవుల్లో అమ్మడు అందాలను ఆరబోయడం లో డోస్ పెంచేసింది.
బికినీ ట్రీట్ లు, సాగర తీరాన సముద్ర కన్యలా విహరిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చేసింది. ఇంకేముంది అంతటి అందాన్ని అలా చుసిన కుర్రాళ్ళు ఊరికే ఉంటారా..? లైకులు, కామెంట్లతో విరుచుకుపడ్డారు.ఏ దివి నుంచి దిగివచ్చిన తారకవు నీవు అని కొంతమంది కవిత్వం చెప్తుండగా.. మరికొంతమంది.. ఇలా మాల్దీవులకే మంటలు తెప్పిస్తే.. మాలాంటి వాళ్ల పరిస్థితి ఏంటి అంటూ నొచ్చుకొంటున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.