యంగ్ హీరో నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ’18 పేజెస్’. ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమా విడుదల తేదీని లాక్ చేశాయి. ఆసక్తికరమైన పోస్టర్ ద్వారా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రానికి పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహించారు. బన్నీ వాస్ నిర్మిస్తుండగా… సుకుమార్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆసక్తికరంగా ఉన్న ఆ పోస్టర్ లో ’18 పేజెస్’ చిత్రాన్ని ఫిబ్రవరి 18న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. పోస్టర్ కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సుకుమార్ మార్క్ టచ్‌తో తెరకెక్కుతున్న ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.
Read Also : మరోసారి చిక్కుల్లో శిల్పా, రాజ్ కుంద్రా… కేసు నమోదు