సోనూ సూద్ మంచి నటుడు మాత్రమే కాదు… మంచి మనిషి కూడా! ఎన్నో సంవత్సరాలుగా సినిమా రంగంలో ఉన్నా, అతనిలోని మానవీయ కోణం మాత్రం గత యేడాది కరోనా సమయంలోనే బయట పడింది. కష్టాలలో ఉన్న వాళ్ళను ఆదుకోవడానికి తన వాళ్ళతో కలిసి ఓ ప్రైవేట్ ఆర్మీనే క్రియేట్ చేశాడు సోనూసూద్. పర్ ఫెక్ట్ ప్లానింగ్ తో ఈ దేశంలో ఆపన్నులు ఎక్కడ ఉన్నా వారికి సరైన సమయంలో సహాయం అందించాడు. అందుకే ఇవాళ అతను అందరి వాడు అయ్యాడు. ఇదే సమయంలో కొందరు సోనూసూద్ సహాయ కార్యక్రమాల సందర్భంగా స్వీకరించిన విరాళాలకు తగిన పన్ను చెల్లించలేదనే విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదంతా పొలిటికల్ గేమ్ అని, అతను రాజకీయాలలోకి ఎక్కడ వస్తాడో అనే భయంతో కొందరు ఆడుతున్న నాటకమని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చెప్పారు. సోనూసూద్ కు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు సోనూ సూద్ ను ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య ఏకంగా కోటి కి చేరింది. ఒక నటుడిగా కంటే మానవత్వం ఉన్న వ్యక్తిగా సోనూసూద్ ను గుర్తించే ఇంతమంది ఫాలో అవుతున్నారనేది నిజం. అందుకే అతను కూడా ట్విట్టర్ అకౌంట్ పేజీలో తమ సేవా కార్యక్రమాలు ఉచితమని, ఎవరికీ ధనాన్ని ఇవ్వవద్దని పేర్కొన్నాడు. ఇవాళ దేశంలో ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చిన ఠక్కున మదిలో మెదిలో పేరు సోనూ సూద్ దే కావడం గొప్ప విషయమే!
Read Also : పెద్ద సినిమాలకు గట్టి దెబ్బ… ఫస్ట్ ఎఫెక్ట్ బాలయ్యపైనే !
