పుదీనా గురించి అందరికీ తెలిసే ఉంటుంది.. వంటల్లో సువాసన పెంచడం మాత్రమే కాదు.. ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను తగ్గిస్తుది.. అందుకే దీన్ని ఆయుర్వేదంలో కూడా ఎక్కువగా వాడుతారు ఇక పుదీనా ఆకులు కూడా బరువు తగ్గడంలో సహాయపడతాయి. దీని కోసం, పుదీనా ఆకుల పానీయాన్ని సిద్ధం చేయండి. ఆపై నిమ్మరసం, నల్ల మిరియాల పొడిని జోడించండి. మీరు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో ఈ పానీయం తాగవచ్చు. ఇది బరువు తగ్గడంలో మీకు సహాయపడుతుంది..
ఈ ఆకుల్లో పుదీనా రెండు టేబుల్ స్పూన్లు కేవలం 2 కేలరీలను మాత్రమే అందిస్తాయి. ఇవి బరువు తగ్గించే ఆహారంలో ఉపయోగించడానికి అనువైన హెర్బ్‌గా ఉంటాయి. జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తుంది.. పుదీనా నీరు కడుపు నొప్పిని దూరం చేస్తుంది. అందుకే వేసవిలో పొట్ట సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందాలంటే కచ్చితంగా పుదీనా నీటిని తాగాలి.. ఈ ఆకుల్లో ఎక్కువగా విటమిన్ ళు ఎక్కువగా ఉంటాయి.. అందుకే శరీరాన్ని ఎప్పుడూ యాక్టివ్ గా ఉంచుతాయి..
పుదీనాలో విటమిన్ సి, ప్రొటీన్, మెంథాల్, విటమిన్ ఎ, కాపర్, కార్బోహైడ్రేట్స్ వంటి పోషకాలు వీటిలో ఉంటాయి. వేసవిలో ప్రజలు తరచుగా వికారం, మంట, గ్యాస్ మొదలైన వాటితో బాధపడుతున్నారు. అలాంటి సమయంలో పుదీనా తీసుకోవచ్చు… ఇకపోతే ఈ పుదీనా టీని రోజు తాగడం వల్ల మీ జీవక్రియలో అద్భుతాలు చేయవచ్చు. పొట్ట కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఎండిన పుదీనా ఆకులను తీసుకోండి, వాటిని వేడి నీటిలో వేయండి. సుమారు 8-10 నిమిషాలు మరిగించి వడకట్టి టేస్ట్ కోసం తేనెను కూడా వేసుకొని తాగితే మంచి ఫలితాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.