మనిషికి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి.. ఈరోజుల్లో సంతోషం కన్నా ఎక్కువగా కోపాన్ని కలిగి ఉంటారు.. తన కోపమే తన శత్రువు అని పెద్దలు ఊరికే చెప్పలేదు.. కోపంలో కొంతమంది ఎం చేస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు.. కోపం వల్ల వచ్చే నష్టాన్ని వారు కూడా భరిస్తారు. అలాంటప్పుడు కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలియక బాధపడతారు.. ఇప్పుడు మనం పట్టలేని కోపాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో తెలుసుకుందాం..
కోపంలో ఏది పడితే అది చెయ్యడం కాదు.. నిద్రపోవడం, మ్యూజిక్ వినడం వంటి వాటి గురించి ఆలోచించండి. కోపం రావడానికి కారణం, పరిస్థితులని మర్చిపోయి సమస్యని పరిష్కరించేందుకు ప్రయత్నించండి. కోపం ప్రతీదానికి పరిష్కారం కాదని గుర్తించుకోవడం మంచిది..
యోగా చెయ్యడం, వ్యాయామాలు చెయ్యడం, కాసేపు వాకింగ్ చెయ్యడం వంటివి చెయ్యాలి.. మనసుని కంట్రోల్ చేసుకోవడానికి బ్రీథింగ్ వర్కౌట్స్ చేయండి.. ఇలా చెయ్యడం వల్ల కోపం కంట్రోల్ అవుతుంది..
కోపంలో తప్పలు చేయడం, మాట్లాడడం మానుకోండి. కోపం తర్వాత వచ్చే సమస్యల గురించి ఆలోచిస్తే కోపం కంట్రోల్ అవుతుంది.. కొన్ని సంతోషకరమైన విషయాలను నెమరు వేసుకుంటే కోపం ఇట్టే తగ్గిపోతుంది..
కోపంలో చాలా మంది ఇతతరులను తిట్టడం, బూతులు మాట్లాడడం చేస్తుంటారు. అలా చేయడం వల్ల ఆ మాటలు తర్వాత చాలా బాధపెడతాయి.. అలాంటి పరిస్థితులను ముందే ఊహించి జాగ్రత్త పడటం మంచిది.. ఇష్టమైన ఫుడ్ చేసుకోవడం, పెయింటింగ్, వంటి ఇతర వాటిపై ఫోకస్ పెట్టడం వల్ల కూడా కోపాన్ని కంట్రోల్ అవుతుంది..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.