Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Home Remedies: వర్షాకాలం వస్తే చాలు వర్షపు చినుకులతో పాటు రకరకాల పురుగులు, కీటకాల బెడద కూడా మొదలవుతుంది. ఇళ్లలో తేమ పెరగడం వల్ల జెర్రులు, దోమలు, చీమలు, నల్లులు విపరీతంగా పెరిగిపోయి ఆరోగ్యానికి, ప్రశాంతమైన నిద్రకు భంగం కలిగిస్తాయి. రసాయనాలు కలిసిన విషపూరిత మందులు వాడకుండా, మన ఇంట్లో దొరికే సహజసిద్ధమైన వస్తువులతో ఈ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. మీ ఇంటిని క్రిమిరహితంగా, సురక్షితంగా ఉంచుకోవడానికి ఉపయోగపడే కొన్ని అద్భుతమైన చిట్కాలను ఇప్పుడు చూద్దాం..
1. జెర్రులు (Centipedes) రాకుండా ఉండాలంటే..
Also Read
- Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- Dandruff: డాండ్రఫ్ మళ్లీ మళ్లీ వస్తోందా? మీ తప్పు కాకపోవచ్చు.. కారణం ఇదే!
- Best Time to Oil Hair: తలకు నూనె విషయంలో అమ్మమ్మల మాటే నిజమా..? రాత్రంతా ఉంచాల్సిన అవసరం ఉందా?
- Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఇంట్లోనే పదును పెట్టండి..!
తేమ లేకుండా పొడిగా ఉంచండి: వంటగది సింక్, బాత్రూమ్ నేలను రాత్రి పూట నీరు లేకుండా తుడిచి ఆరబెట్టాలి. పైపులు, నల్లాల లీకేజీలను వెంటనే రిపేర్ చేయించాలి.
రంధ్రాలు మూసివేయండి: గోడల బిరుకులు, టైల్స్ మధ్య సందులు, తలుపుల కింద ఉండే గ్యాప్‌లను ‘సిలికాన్ సీలెంట్’ లేదా డోర్ స్వీప్స్‌తో మూసివేయాలి.
ఉప్పు, కర్పూరం స్ప్రే: కల్లుప్పు వేసిన నీటితో ఇల్లు తుడవాలి. కర్పూరం పొడి, కొద్దిగా వెనిగర్, డెటాల్లను నీటిలో కలిపి సింక్ కింద, మూలల్లో స్ప్రే చేస్తే కర్పూరం ఘాటుకు జెర్రులు పారిపోతాయి.
పుదీనా నూనె (Peppermint Oil): స్ప్రే బాటిల్ నీటిలో 10-15 చుక్కల పుదీనా లేదా టీ ట్రీ ఆయిల్ కలిపి మూలల్లో పిచికారీ చేయాలి. డ్రైనేజీ పైపుల్లో ఒక కప్పు వైట్ వెనిగర్ పోయడం వల్ల కూడా అవి పైకి రాకుండా ఉంటాయి.
2. దోమల దండయాత్రకు చెక్ పెట్టండి
వెల్లుల్లి స్ప్రే: వెల్లుల్లిని పేస్ట్ చేసి నీటిలో కలిపి గోడలపై స్ప్రే చేయాలి. వెల్లుల్లి ఘాటైన వాసనకు దోమలు ఇంట్లోకి రావు.
లావెండర్, వెనీలా మిశ్రమం: ఒక కప్పు నీటిలో 10 చుక్కల లావెండర్ ఆయిల్, 4 చుక్కల వెనీలా ఎసెన్స్, నిమ్మరసం కలిపి చేతులు, కాళ్లకు రాసుకుంటే దోమలు కుట్టవు.
వేప నూనె మిశ్రమం: 10-12 చుక్కల వేపనూనె లేదా టీ ట్రీ ఆయిల్ ను 30 ml కొబ్బరినూనెలో కలిపి శరీరానికి అప్లై చేయడం వల్ల దోమల నుంచి రక్షణ లభిస్తుంది.
కర్పూరం దీపం: ఇంట్లో తలుపులు, కిటికీలు మూసివేసి, పచ్చ కర్పూరం వేసిన దీపం వెలిగించి అరగంట తర్వాత తలుపులు తెరిస్తే దోమలన్నీ బయటకు పారిపోతాయి.
3. చీమల బెడద నుంచి ముక్తి
నిమ్మరసం & వెనిగర్: చీమలు వచ్చే మార్గాల్లో నిమ్మరసం చల్లినా, లేదా సగం నీటిలో రెండు చెంచాల వైట్ వెనిగర్ కలిపి స్ప్రే చేసినా చీమలు రావు.
మసాలా దినుసులు: దాల్చిన చెక్క పొడి, మిరియాల పొడి లేదా పసుపును చీమలు ఉండే మూలల్లో చల్లితే వెంటనే వెళ్ళిపోతాయి.
పుదీనా & కర్పూరం: పుదీనా ఆకులు లేదా కర్పూరం బిళ్లలను గది మూలల్లో ఉంచితే వాటి ఘాటుకు చీమలు దూరంగా ఉంటాయి.
మొక్కల వద్ద సంరక్షణ: ఇండోర్ ప్లాంట్స్ కుండీలలో వాడేసిన నిమ్మ తొక్కలు లేదా కొద్దిగా కాఫీ పొడి ఉంచితే చీమలు చేరకుండా ఉంటాయి.
4. నల్లులను (Bed Bugs) వదిలించుకోవడానికి..
వేడి నీటితో ఉతకడం: వారానికి ఒకసారి బెడ్ షీట్లు, పిల్లో కవర్లను 50-60 డిగ్రీల వేడి నీటిలో ఉతికి ఎండలో ఆరేస్తే నల్లులు, వాటి గుడ్లు నాశనం అవుతాయి.
ఎండలో ఉంచడం: నల్లులు చీకటిని ఇష్టపడతాయి. కాబట్టి వారానికి రెండుసార్లు మంచం పరుపులను, దుప్పట్లను మంచి ఎండలో ఉంచాలి.
వేపాకుల పొగ: ఎండిన వేపాకులను కాల్చి గదిలో పొగ వేస్తే నల్లులు, ఇతర క్రిములు పారిపోతాయి.
ఎసెన్షియల్ ఆయిల్స్ & బేకింగ్ సోడా: లావెండర్ లేదా పిప్పరమెంట్ ఆయిల్‌ను దూదిపై వేసి బెడ్ మూలల్లో ఉంచాలి. అలాగే పరుపుల సందుల్లో బేకింగ్ సోడా చల్లడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
తాజావార్తలు
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Delhi Police Attack: షాకింగ్ ఘటన.. కర్రలు, ఇటుకలతో పోలీసులపై దాడి (వీడియో)
-
Telangana Auto, Cab Strike: అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్స్ బంద్..
-
IND vs SL 2nd Test: 33 ఏళ్ల సారాంశ్ జైన్ అరంగేట్రం.. కుల్దీప్ యాదవ్ ఆడకపోవడానికి కారణం ఫామ్ కాదు!
-
David Reddy: మంచు మనోజ్ సినిమాలో శింబు.. అన్నయ్యగా స్పెషల్ రోల్?
ట్రెండింగ్
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!