Marriage problems వద్దురా.. సోదరా.. పెళ్లంటే నూరేళ్ల మంటరా.. మన్మధుడు సినిమాలోని ఈ సాంగ్ ఎప్పటికి మరిచిపోలేం. ఇందులో హీరో నాగార్జున యూత్ కి చెప్పే మాటలు. అయితే ఆ మాటలు జీవితంలో వర్తించవు. పెళ్లి కాలేదని బాధపడే వారు కొందరైతే.. పెళ్లి ఎందుకు చేసుకున్నారా దేవుడా అని బాధపడేవారు మరి కొందరు. అయితే.. పెళ్లైతే అంతా సర్దుకుపోతుందిలే అనుకునే వారు కొందరైతే పెళ్లైయ్యాక సర్దుకుపోవడమేమో కానీ.. అర్ధం పర్థం లేని మాటలు, మాట పట్టింపులతో పెళ్లి, తాళి బంధాన్ని ఎగతాళి చేసుకునేంత వరకు వెళుతుంటారు. తాళి బంధంతో ఇద్దరు వ్యక్తుల కలయికే వివాహంలో వీరిద్దరూ కూడా వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చినవారే. ఒకరి ఇంటికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి, మరొకరి ఇంటికి కొన్ని ఆచారాలు ఉంటాయి. ఇదంతా ముందుగా అర్థం చేసుకోవాలి. ఇతరులకు అనుగుణంగా మారడానికి ప్రయత్నించండి. అసలు పెళ్లి చేసుకున్న వారి జీవితంలో ఏం జరుగుతుంది. అసలు నిజంగా పెళ్లైతే అన్ని కష్టాలు ఉంటాయా?
ప్రతి ఇంట్లో ఆడవారు పనులు చేస్తే భర్త పెద్దగా పట్టించుకోడు. దీంతో భార్యకు కోపం వస్తుంది. అలాగే ఇంటిని శుభ్రంగా, అందంగా ఉంచుకోవడానికి అంత ఓపిక ఉండదు. ఇద్దరి మధ్య గొడవలు జరిగే అవకాశం ఉంది. వైవాహిక జీవితంలో శృంగారం కూడా చాలా ముఖ్యం. అయితే ఈ విషయంలో కొందరి భార్యాభర్తల మధ్య విభేదాలు వచ్చాయి. ఒకరికి నచ్చేది మరొకరికి నచ్చదు. ఒకనొకరు ఎలాంటి శృంగారం ఇష్టమో తెలుసుకోవాలి. అందుకే అన్ని విషయాల్లో ఓపెన్ గా మాట్లాడుకోవాలి. ఒకనొకరు అర్థం చేసుకోవాలి. ఇక ఇంట్లో చిన్న పిల్లలుంటే చెప్పాల్సిన అవసరం లేదు. పని ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది. డైపర్లు మార్చడం నుంచి అన్నీ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్య కాలంలో భార్యాభర్తల మధ్య బాధ్యతల విషయంలో గొడవలు ఎక్కువయ్యాయి. అంతే కాకుండా పిల్లలను పెంచే విధానం కూడా ఇద్దరినీ ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పిల్లల ముందు గొడవలు పెట్టుకోవడం మంచిది కాదు. వారికి మీ మీద వున్న ప్రేమ కన్నా వారి ముందు మీరు గొడపడితే ద్వేషం పెరుగుతుంది. మిమ్మల్ని చూసి జీవితాన్ని నేర్చుకోవాల్సిన చిన్నారులు ఇలా వారి ముందు గొడవపడితే మనస్సు చలించిపోతుంది.
పెళ్లి తర్వాత అదనపు బాధ్యతలు పెరుగుతాయి. అందుకే భర్త పని నుంచి ఇంటికి వచ్చి అనుకున్నది చేయకపోతే, భార్య ఇతర సమస్యలు చెబితే ఒత్తిడి వస్తుంది. పెళ్లయ్యాక మొదట అత్తగారు. ఎందుకంటే ముందే చెప్పుకున్నట్టు ఒక్కో ఇంటికి ఒక్కో కమిట్ మెంట్స్ ఉంటాయి. కాబట్టి, వారికి అర్థం చేసుకోలేరు. అత్తగారు అమ్మలా ఉండాలని, కోడలు కూతురులా ఉండాలని చాలా మంది చెబుతుంటారు. కానీ, ఇది కొన్ని ఇళ్లలో మాత్రమే సాధ్యమవుతుంది. అయితే అత్తగారికి కోడలు అంటే ఇష్టం ఉండదు. మరి అల్లుడి ప్రవర్తన అత్తగారికి నచ్చదు. ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. భర్త నిద్రకు ప్రాధాన్యత ఇస్తుంటే, భార్య షాపింగ్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇలాంటి అలవాట్ల వల్ల ఇబ్బంది పడతారు. గొడవలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కాబట్టి వీటన్నింటి దృష్టిలో వుంచుకుని మనం పెళ్లికి సిద్దమవ్వాలి. ఇటు పుట్టింటిని, అటు అత్తింటిలో వచ్చే గొడవలను సమయస్పూర్తితో సయోద్య కుదిర్చే విధంగా ఉండాలి. భార్యను మీరు మిమ్మల్ని భార్య సరిగా అర్థం చేసుకునే విధంగా ఉండాలి. ఇది కుదరదు ఇవన్నీ నేను చేయలేను అనుకుంటే ఇక పెళ్లే అవసరం లేదు. ఇవన్నీ భరించని వారు, సమయస్పూర్తితో వ్యవహించని వాళ్లు పెళ్లే వద్దంటారు. మరొకొందరు తమ తెలివితో చాకచక్యంగా కుటుంబాలలో తలెత్తే ప్రతి విషయంలోను అందరిని కలుపుకుని ముందుకు సాగుతుంటారు. ఇలా చేస్తేనే కదా జీవితం మరి. అందుకే చాలా మంది పెళ్ళి చేసుకో నీకే తెలుస్తుంది.. కామన్‌గా పెళ్ళైనవారు చెప్పే మాటలు ఇవి.
నోట్ :గమనిక: ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే ప్రతిబింబిస్తాయి. ఇది ఎవరినీ ఉద్దేశించి కాదు.