Tattoo : గత కొన్ని సంవత్సరాలలో పచ్చబొట్లు బాగా ప్రజాదరణ పొందాయి. అన్ని వయసుల ప్రజలు వీటిని శరీరంపై వేసుకుంటున్నారు. అయితే పచ్చబొట్లు ఒకరి శరీరానికి అందాన్ని చేకూర్చినప్పటికీ, వాటితో సంబంధం ఉన్న ప్రతికూలతలు, అనేక ఆరోగ్య సమస్యలను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. పచ్చబొట్టు వేయించుకోవడమంటే ముఖ్య సమస్య అది శాశ్వతంగా ఉండడమే. అంతేకాకుండా పచ్చబొట్లను సులభంగా తొలగించలేము. పచ్చబొట్లను తొలిగించాలంటే చాలామంది లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తొలిగించుకుంటారు. అయితే ఈ తొలగింపు ఖరీదైనది మాత్రమే కాకుండా బాధాకరమైనది కూడా. అంతే కాదు చాలా సమయం తీసుకుంటుంది.
ఇక ఈ టాటూ ఇంక్ లోని కొన్ని రసాయనాలు లింఫోమా ప్రమాదాన్ని పెంచుతాయి. పచ్చబొట్లు నేరుగా క్యాన్సర్ కు కారణమవుతాయని చాలా మంది భావిస్తారు. కాకపోతే, పచ్చబొట్లలలో వాడే కెమికల్స్ వల్ల అది నింర్ణయం జరుగుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం లింఫోమా క్యాన్సర్. అయితే దీని వల్ల పెద్దగా ప్రమాదం ఉండకపోవొచ్చు. ఇకపోతే టాటూ వేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే.. దానిని ముందుగా అర్థం చేసుకోవాలి. కచ్చితంగా ప్రొఫెషనల్ టాటూ ఆర్టిస్ట్ ద్వారా మాత్రమే దీన్ని వేయించుకోవాలి. పరిశుభ్రత పాటించే, నాణ్యమైన ఇంక్ వాడే ప్రదేశంలో మాత్రమే పచ్చబొట్టు వేయించుకోవాలి. ఒకవేళ ఏదైనా తీవ్రమైన వ్యాధి కనుక మీకు ఉంటే.. నిపుణుల నుంచి కూడా సలహా తీసుకోవాలి.
Bhatti Vikramarka: ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాలి.. శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న డిప్యూటీ సీఎం