Parenting Tips: తల్లిదండ్రులూ తస్మాత్ జాగ్రత్త! రిజల్ట్స్ వచ్చేశాయ్.. పిల్లల ప్రవర్తనను గమనించండి!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Parenting Tips: తెలంగాణలో ఇంటర్ ఫలితాలు విడదలయ్యాయి.. ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే విడుదల చేశారు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది ఫలితాలు శాతం పెరిగింది.. జనరల్, ఒకేషనల్ కలిపి 70.58 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక ఫలితాలు చూడగానే ఇళ్లలోని తల్లిదండ్రులు, సమాజంలోని వ్యక్తులు సూటిపోటి మాటలు అంటుంటారు. తక్కువ మార్కులు వచ్చాయని, ఫెయిల్ అయ్యారని నిందిస్తుంటారు. ఇది చాలా తప్పు. కేవలం మార్కులు మాత్రమే పిల్లల భవిష్యత్తును నిర్ణయించలేవు. విద్యార్థులు కూడా ఫలితాలపై చింతించకండి. తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి.
READ MORE: Mega 158 : జన నాయగన్ ఎఫెక్ట్.. మెగా 158పై గట్టిగానే ప్రభావం చూపిస్తోంది
Also Read
- Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
- Easy Egg Peeling Tips: ఉడికించిన గుడ్లను సులభంగా ఒలిచే సింపుల్ పద్ధతి.. ఈ చిన్న పొరపాట్లు చేయకండి!
- Vastu Tips: దీపం, ఉప్పు, పాలు చేతిలో నుంచి జారి కింద పడితే అశుభమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
- Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
తల్లిదండ్రులకు కీలక సూచనలు…
పిల్లలు ఎన్ని మార్కులు సాధించినా, వారు మీ బిడ్డలే. వారికి ఈ టైమ్లో భరోసా ఇవ్వండి.. తిట్టకండి. పక్కింటి పిల్లలతో లేదా బంధువుల పిల్లలతో మీ పిల్లలను పోల్చడం ఆపండి. ప్రతి బిడ్డకు ఒక ప్రత్యేక నైపుణ్యం ఉంటుంది. ఒక పరీక్షలో తప్పడం అంటే జీవితంలో ఓడిపోవడం కాదు. అది కేవలం ఒక చిన్న అడ్డంకి మాత్రమే అని గుర్తుంచుకోండి. మీ పిల్లలకు ధైర్యం చెప్పండి. ముందు తిట్టడం మానేసి పిల్లలు ఎందుకు తక్కువ మార్కులు తెచ్చుకున్నారో లేదా వారి బాధ ఏమిటో ప్రశాంతంగా అడిగి తెలుసుకోండి. వారి బాధను వ్యక్త పరచనివ్వండి. ఇప్పటికే పిల్లలు బాధలో ఉంటారు. ఈ సమయంలో కఠినంగా ప్రవర్తిస్తే మరింత కుంగిపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది.”నేనున్నాను.. చూసుకుందాం” అనే చిన్న మాట వారిలో కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. మార్కులు తక్కువ వస్తే రీ-కౌంటింగ్ లేదా ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షలు రాసే అవకాశం ఉందని సానుకూలంగా చెప్పండి. చదువులో వెనుకబడి ఆ తర్వాత ప్రపంచాన్ని శాసించిన గొప్ప వ్యక్తుల గురించి వివరించండి. బిడ్డ మౌనంగా ఉన్నా, ఆహారం తీసుకోకపోయినా, గదిలోనే ఒంటరిగా ఉన్నా వెంటనే స్పందించి ప్రేమగా దగ్గరకు తీసుకోండి. చుట్టుపక్కల వారు ఏమనుకుంటారో అనే భయంతో పిల్లలపై కోపం చూపకండి. సమాజం కంటే మీ బిడ్డ ప్రాణం ముఖ్యం. ఎక్కడ తప్పు జరిగిందో ప్రశాంతంగా కూర్చుని చర్చించి, వచ్చేసారి ఎలా మెరుగుపరుచుకోవాలో ప్రణాళిక వేయండి. చివరిగా మీ ఫలితాలు వచ్చిన మొదటి రెండు మూడు రోజులు పిల్లలను అస్సలు ఒంటరిగా వదలకండి. వారితో కలిసి ఉండండి.
తాజావార్తలు
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్యూ నుంచి అంగోంచా తొలగింపు
-
Tollywood: ‘లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..’ టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
-
No Cost EMI: నో-కాస్ట్ EMI నిజంగా ఉచితమేనా..? అబ్బో ఇంత కథ ఉందా.. తెలియాల్సింది చాలానే ఉంది..
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు