Sleep Tourism: నయా ట్రెండ్.. స్లీప్ టూరిజంకు పోతారా.. !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sleep Tourism: ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టి రావాలనే కల ఎంతో మందిలో ఉంటుంది. అనేక సమస్యలు, మానసిక ప్రశాంతత కోసం ఇలా చాలా మంది పర్యటనలకు వెళ్తుంటారు. బాస్ ఇప్పుడు ట్రెండ్ మారింది తెలుసా.. ఏందా ట్రెండ్ అనుకుంటున్నారా.. ఒళ్లు మర్చిపోయి నిద్రపోవడం. నిజం అండీ బాబు.. దీనికే స్లీప్ టూరిజం అనే పేరు కూడా ఉంది. ఇంతకీ ఈ నయా ట్రెండ్ కథ ఏంటి, ఎందుకు ఈ ట్రెండ్ పాపులర్అవుతుంది.. మన దేశంలో ఈ స్లీప్టూరిజంకు అనువైన ప్రదేశాలు ఎక్కడ ఉన్నాయి అనేవి ఈ స్టోరీలో తెలుసుకుందాం..
READ ALSO: Cyber Fraud : సైబర్ క్రైమ్ పోలీసుల దాడులు.. ట్రేడింగ్ మోసం నుంచి ఫెడెక్స్ ఫ్రాడ్ వరకు
Also Read
- Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ 'మష్రూమ్ పులావ్'.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
- Mental Illness: 20ఏళ్ల ఆయుష్షు తగ్గుతుంది!
- CDSCO Warning : పెయిన్ కిల్లర్లు, యాంటీబయోటిక్స్‌తో జాగ్రత్త.. కిడ్నీలకు ముప్పు!
- Pandu Mirapakaya Pachadi: ఏడాది దాటినా అదే ఘాటు, అదే రుచి! పక్కా కొలతలతో పండు మిరపకాయ పచ్చడి ఇలా పెట్టేయండి..
తెలిసినా త్యాగం చేస్తున్నారు..
నిజంగా ఈ జనరేషన్‌లో చాలా మందికి పని ఒత్తిడి, ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లతో కాలక్షేపం చేస్తూ సరైన నిద్ర పోవడం లేదు. మనిషికి మంచి నిద్ర లేకపోతే తలెత్తే అనారోగ్య సమస్యలు తెలిసినా కూడా ఎలక్ట్రానిక్ పరికరాల మోజులో పడి నిద్రను త్యాగం చేస్తున్నారు. ఇగో వీటిని దృష్టిలో పెట్టుకొని వచ్చేందే..’స్లీప్ టూరిజం’. ప్రస్తుతం దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. టూరిజం అంటే సాధారణంగా కొత్త ప్రదేశాలు వెళ్లడం, చూడటంగా భావిస్తాం. కానీ స్లీప్ టూరిజం మాత్రం ప్రత్యేకం. ఈ టూరిజంలో శరీరానికి, మనసుకీ ప్రశాంతమైన నిద్రను అందించడమే దీన్ని ముఖ్య ఉద్దేశం. తాజా ఈ టూరిజం ప్రపంచ వ్యాప్తంగా సరికొత్త పరిశ్రమగా ఎదుగుతోంది. భవిష్యత్తులో ఈ టూరిజం బిలియన్ డాలర్ల వ్యాపారంగా మారుతుందంటున్నారు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దేశంలోనూ నయా ట్రెండ్..
స్లీప్ టూరిజం అంటే నిద్ర కోసం ప్రత్యేకంగా పర్యటనలకు వెళ్లడం. పనిలో ఒత్తిడి, అలసట బాధపడుతున్న వారు కొత్త ప్రాంతాలకు వెళ్లి విశ్రాంతి తీసుకోవడంతో పాటు మనసారా నిద్ర పోవడమే ఈ పర్యటకం ప్రత్యేకత. దీన్ని ‘నాప్కేషన్స్’ లేదా ‘డ్రీమ్ టూరిజం’ అని కూడా అంటున్నారు. ఇప్పటికే అమెరికా, జపాన్, దుబాయ్, యూరప్ లాంటి ప్రాంతాల్లో ప్రత్యేకమైన ‘స్లీప్ హోటల్స్’ ఉన్నాయి. ఇప్పుడు మన దేశంలోనూ ఈ పద్ధతి క్రమంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా ఈ ట్రెండ్‌ను హిమాలయ ప్రాంతాలు, కేరళలోని ఆయుర్వేద రిసార్ట్‌లు, గోవా బీచ్ రిసార్ట్‌లలో అనుసరిస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేకమైన ఆయుర్వేద మసాజ్‌లు, హెర్బల్ థెరపీ, యోగా, ధ్యానం ద్వారా సహజ నిద్రను కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు.
అవసరం అంటారా?
ఇండియన్ జర్నల్ ఆఫ్ స్లీప్ మెడికన్ నివేదికలో పలు సంచలన నివేదికలు వెలుగుచూశాయి.. మన దేశంలో 61 శాతం మంది రోజుకు ఏడు గంటల కంటే తక్కువ సమయం నిద్రపోతున్నారని ఈ నివేదిక పేర్కొంది. పలు అధ్యయనాల్లో.. ప్రతి 10 మందిలో ముగ్గురు కంటే తక్కువ మంది మాత్రమే సాధారణ నిద్రపోతున్నారని వెల్లడైంది. చాలా మంది రోజులో ఆరు గంటలు కూడా నిద్ర పోవడం లేదని పేర్కొంటున్నాయి. ఈసందర్భంగా పలువురు నిపుణులు మాట్లాడుతూ.. రోజువారీ కార్యకలాపాలు, పనిలో ఒత్తిడితో పోరాటం, కుటుంబం ఆర్థిక భారం వల్ల కలిగే మానసిక ఒత్తిడిని నివారించుకోవడానికి ఈ స్లీప్ టూరిజం దోహదం చేస్తుందంటున్నారు. కొత్త ప్రాంతాల పర్యటనకు వెళ్లి, అక్కడ విశ్రాంతితో పాటు హాయిగా నిద్రపోయేందుకు ప్రాధాన్యం ఇవ్వాలంటున్నారు.
స్లీప్టూరిజంకు అనువుగా ఉండే ప్రాంతాలు..
మన దేశంలో స్లీప్ టూరిజంకు ఉత్తరాఖండ్‌లోని రుషికేష్, బ్యాక్ వాటర్.. హౌజ్బోటులకు ప్రసిద్ధి చెందిన కేరళలోని అలెప్పీ, పచ్చని కాఫీ తోటలు, పొగమంచు కొండలు, ప్రశాంత వాతావరణాన్ని కలిగిన కర్ణాటక లోని కూర్గ్, గోవా, కర్ణాటకలోని గోకర్ణలో ప్రశాంతంగా ఉండే బీచ్‌లు అనువైనవి. అలాగే హిమాచల్‌ప్రదేశ్‌లోని స్పితిలోయ, తీర్థన్ వ్యాలీ, గ్రేటర్ హిమాలయన్ నేషనల్ పార్కు మొదలైనవి స్లీప్టూరిజంకు అనువుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో హాయిగా నిద్రపోయేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన సౌకర్యవంతమైన మంచాలు, నిద్ర నాణ్యతను మెరుగుపరిచే లైటింగ్ సిస్టమ్, నిద్ర నిపుణుల ద్వారా శిక్షణ, ప్రత్యేక సౌండ్ ప్రూప్ గదులను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
READ ALSO: Russia Ukraine War: పసి కూనపై రష్యాకు ఎందుకు ఇంత పగ.. !
తాజావార్తలు
-
Hashmi – Himesh : 20 ఏళ్ల తర్వాత ఇమ్రాన్ హష్మీ, హిమేష్ రేష్మియా రీ యూనియన్
-
Madras Regiment Arms Theft Case: బొల్లారం మద్రాసు రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో బిగ్ ట్విస్ట్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
Iran Trolls Trump: ట్రంప్‌ను టీజ్ చేసిన ఇరాన్.. బాలయ్య ‘భగవంత్ కేసరి’ క్లిప్‌తో కౌంటర్
-
Budameru Floods: బుడమేరులో పెరిగిన వరద ఉద్ధృతి.. అప్రమత్తమైన అధికారులు..
ట్రెండింగ్
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్‌షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!