Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శబరిమల అనగానే ప్రతి ఒక్కరికీ ముందుగా గుర్తొచ్చేది అయ్యప్ప స్వామి ప్రసాదం. ఎవరైనా శబరిమల వెళితే ఈ ప్రసాదం తీసుకురావాలని భక్తులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సరైన కొలతలు, పదార్థాలు ఉపయోగిస్తే అచ్చం శబరిమల ప్రసాదం రుచితో ఈ ప్రసాదాన్ని మన ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు.
కావలసిన పదార్థాలు
రెడ్ రైస్ (ఎర్ర బియ్యం): 1 బౌల్
తాటి బెల్లం తురుము: 3 బౌల్స్ (సుమారు 1/2 కేజీ) – అసలైన రుచి కోసం తాటి బెల్లాన్ని మాత్రమే వాడాలి.
ఆవు నెయ్యి: 5 నుండి 6 టేబుల్ స్పూన్లు (మొత్తంగా)
నీళ్లు: 3 బౌల్స్ (అన్నం ఉడికించడానికి) + 3/4 కప్పు (బెల్లం కరిగించడానికి)
ఎండు కొబ్బరి ముక్కలు: 2 టేబుల్ స్పూన్లు (చిన్న ముక్కలుగా కట్ చేసినవి)
నల్ల ఎండు ద్రాక్ష: 2 టేబుల్ స్పూన్లు
సొంటి పొడి: 1 టీ స్పూన్
యాలకుల పొడి: 1 టీ స్పూన్
పచ్చ కర్పూరం: చిటికెడు (చాలా చిన్న ముక్క)
Also Read
- Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
- Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. 'మునగాకు పొడి'.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
- Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
- Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
## తయారీ విధానం
1. ఒక బౌల్ రెడ్ రైస్‌ను తీసుకుని నీటిలో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి (దీనిని నానబెట్టాల్సిన అవసరం లేదు). స్టవ్ మీద పాన్ పెట్టుకుని 1-2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి, కడిగిన బియ్యాన్ని మీడియం మంటపై 5 నిమిషాల పాటు కమ్మటి వాసన వచ్చే వరకు దోరగా వేయించాలి.
2. వేయించిన బియ్యంలో, ఏ బౌల్‌తో అయితే బియ్యం తీసుకున్నామో అదే బౌల్‌తో 3 బౌల్స్ నీళ్లు పోసి ఉడికించాలి (సమయం ఆదా కోసం ప్రెజర్ కుక్కర్ కూడా వాడొచ్చు). అన్నం మరీ సాఫ్ట్‌గా పేస్ట్‌లా కాకుండా, గింజలు చేత్తో నొక్కితే మెత్తగా నలిగేలా, కొద్దిగా పలుకుగా ఉడికించుకోవాలి. అన్నం మరీ మెత్తబడిపోతే ప్రసాదం సరైన ఆకృతి రాదు.
3. మరో గిన్నెలో ముప్పావు కప్పు నీళ్లు పోసి, 3 బౌల్స్ తాటి బెల్లం తురుము వేసి కరిగించాలి. పాకం రానవసరం లేదు, బెల్లం పూర్తిగా కరిగితే చాలు. బెల్లంలో ఉండే నలకలను తొలగించడానికి ఈ ద్రావణాన్ని ఫిల్టర్ చేసుకోవాలి.
4. ఉడికిన అన్నంలో వడకట్టిన బెల్లం నీళ్లను కలపాలి. మంటను మీడియం లేదా లో ఫ్లేమ్‌లో ఉంచి, అడుగు పట్టకుండా మాడిపోకుండా గరిటతో కలుపుతూ ఉండాలి.
5. మిశ్రమం కాస్త దగ్గర పడుతున్నప్పుడు చిన్నగా కట్ చేసిన ఎండు కొబ్బరి ముక్కలు, నల్ల ఎండు ద్రాక్షలను నేరుగా అందులో వేయాలి (వీటిని నెయ్యిలో వేయించాల్సిన అవసరం లేదు). మధ్యమధ్యలో 3-4 టేబుల్ స్పూన్ల నెయ్యిని కొద్దికొద్దిగా వేస్తూ 15-20 నిమిషాల పాటు నిదానంగా ఉడికించాలి.
6. మిశ్రమం చిక్కబడ్డాక సొంటి పొడి, యాలకుల పొడి, చిటికెడు పచ్చ కర్పూరం వేసి బాగా కలపాలి.
7. మంటను మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి మరో 10-15 నిమిషాలు ఉడికించాలి. మిశ్రమాన్ని చేతి వేళ్ల మధ్య పట్టుకుంటే చిక్కటి తీగ పాకంలా అనిపించినప్పుడు సరైన కన్సిస్టెన్సీ వచ్చినట్లు. వెంటనే స్టవ్ ఆపేసి, కడాయిని పక్కకు దించుకోవాలి.
పూర్తిగా చల్లారిన తర్వాత ఈ ప్రసాదాన్ని దేవునికి నైవేద్యంగా సమర్పించి కుటుంబ సభ్యులతో పంచుకోవచ్చు. దీనిని ఫ్రిడ్జ్‌లో భద్రపరుచుకుంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. కచ్చితమైన కొలతలతో చేసే ఈ ప్రసాదం అచ్చం శబరిమల పాయసాన్ని తలపిస్తుంది.
తాజావార్తలు
-
Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
-
Tollywood Stars : ఆరోగ్యాన్ని పక్కన పెట్టి షూటింగ్స్‌కు పరుగులు ఎందుకు?
-
Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం
-
The Paradise: ప్యారడైజ్‌కు ప్యాకప్.. ఇక థియేటర్లలో నాని మాస్ రచ్చే!
-
CNR Rao: భారతరత్న శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావుకు ఎస్ఐఆర్ నోటీసు.. కారణం ఇదే!
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!