Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్‌ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
- ఫ్రిజ్ లెవెల్ సరిగ్గా ఉందా?
- గోడకు దూరం ఎందుకు అవసరం?
- వెనుక గ్రిల్, ఫ్రీజర్ శుభ్రత ముఖ్యం
- కంప్రెసర్ బోల్ట్స్ కూడా చెక్ చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kitchen Tips: ఫ్రిజ్ నుండి కొద్దిపాటి శబ్దం రావడం సాధారణమే అయినప్పటికీ, అది అకస్మాత్తుగా పెరిగినా లేదా వింతగా టకటకమని గట్టిగా కొట్టుకున్నట్లు వినిపించినా ఆందోళన చెందడం సహజం. ఇలాంటి శబ్దాలు సాధారణంగా ఫ్రిజ్‌లో ఏదో లోపం ఉందని సూచిస్తాయి. కొన్నిసార్లు కంప్రెసర్ పాతదవడం వల్లనో, ఐస్ గడ్డకట్టడం వల్లనో లేదా ఫ్రిజ్ వెనుక భాగంలోని కాయిల్స్పై దుమ్ము పేరుకుపోవడం వల్లనో ఈ సమస్య వస్తుంది. అయితే, దీనికోసం ప్రతిసారీ టెక్నీషియన్‌ను పిలిచి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే సులభంగా ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.
ఫ్రిజ్ సమతలంగా ఉందో లేదో తనిఖీ చేయండి
రిఫ్రిజిరేటర్ పెద్దగా శబ్దం చేయడానికి అత్యంత సాధారణ కారణం.. దానిని నేలపై సరిగ్గా అమర్చకపోవడం. నేల సమతలంగా లేనప్పుడు కంప్రెసర్ రన్ అవుతున్న సమయంలో ఫ్రిజ్ వణకడం , శబ్దం చేయడం మొదలవుతుంది. ఫ్రిజ్‌ను మీ చేతితో మెల్లగా ఊపి చూడండి; అది ఒక వైపుకు వంగుతుంటే దానిని సమతుల్యం చేయడానికి కాళ్ల కింద రబ్బరు ప్యాడ్ లేదా చెక్క ముక్కను పెట్టండి. కింద ఉండే స్క్రూలను అడ్జస్ట్ చేయడం ద్వారా లేదా ఫ్రిజ్ కోసం ఒక మంచి ‘ట్రాలీ’ని ఉపయోగించడం ద్వారా కూడా ఈ సమస్యను సులభంగా దూరం చేయవచ్చు.
Also Read
- Skincare Tips: బ్యూటీ పార్లర్‌కు బై బై చెప్పండి!.. ఇంట్లోనే సహజంగా ముఖానికి మెరుపు తెచ్చే 3 టిప్స్ ఇవే..
- Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
- Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
గోడకు మరీ దగ్గరగా పెట్టకండి
చాలా మంది స్థలం కలిసి వస్తుందని ఫ్రిజ్‌ను గోడకు పూర్తిగా ఆనించి పెడుతుంటారు. కంప్రెసర్ నడుస్తున్నప్పుడు వచ్చే వైబ్రేషన్లు గోడకు తగిలి పెద్ద శబ్దాన్ని సృష్టిస్తాయి. అందుకే ఫ్రిజ్ , గోడ మధ్య కనీసం 6 అంగుళాల (సుమారు 5 నుండి 10 సెం.మీ) ఖాళీ ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల కంప్రెసర్ చుట్టూ గాలి బాగా ప్రసరించి అది వేడెక్కకుండా ఉంటుంది , శబ్దం కూడా తగ్గుతుంది. అంతేకాదు, వెనుక వైపు ఉండే రిఫ్రిజెరెంట్ లైన్లు, క్యాపిల్లరీ ట్యూబ్‌లు ఒకదానికొకటి లేదా బయటి మెటల్ ప్లేట్లను తాకకుండా చూసుకోవడం ద్వారా గలగలమనే వింత శబ్దాలను అరికట్టవచ్చు.
వెనుక వైపు ఉన్న నల్ల గ్రిల్‌ను శుభ్రం చేయండి
ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే నల్లటి గ్రిల్ (మెష్) పై దుమ్ము, ధూళి పేరుకుపోతే అది కంప్రెసర్‌పై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల కంప్రెసర్, కూలింగ్ ఫ్యాన్లు మరింత కష్టపడి, వేగంగా తిరగడం వల్ల శబ్ద స్థాయి గణనీయంగా పెరుగుతుంది. కాబట్టి నెలకు ఒకసారైనా బ్రష్‌తో లేదా పొడి గుడ్డతో ఆ గ్రిల్‌ను శుభ్రం చేస్తూ ఉండాలి. దీనివల్ల శబ్దం తగ్గడమే కాకుండా ఫ్రిజ్ యొక్క కూలింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది.
ఫ్రీజర్‌లో మంచు గట్టిపడనీయవద్దు
ముఖ్యంగా సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్లలో మంచు మందంగా పేరుకుపోకుండా జాగ్రత్త పడాలి. ఫ్రీజర్‌లో మరీ ఎక్కువగా ఐస్ గడ్డకట్టినప్పుడు, లోపల ఉండే ఫ్యాన్ ఆ మంచుకు తగులుతూ పెద్ద శబ్దం చేయడం మొదలుపెడుతుంది. మీ ఫ్రిజ్ నుండి ఇలాంటి శబ్దం వస్తున్నట్లయితే వెంటనే ‘డీఫ్రాస్ట్’ బటన్‌ను నొక్కి, మంచు పూర్తిగా కరిగిపోయేలా చేయాలి.
కంప్రెసర్ నట్స్ , బోల్ట్స్ చెక్ చేయండి
కొన్నిసార్లు కంప్రెసర్ కింద ఉండే మౌంటింగ్ రబ్బర్లు కాలక్రమేణా గట్టిపడటం లేదా వాటి నట్స్ , బోల్ట్‌లు వదులవ్వడం వల్ల కంప్రెసర్ స్థిరత్వం కోల్పోయి పక్క గోడలను తాకుతూ శబ్దం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఫ్రిజ్ ప్లగ్ తీసివేసి, కంప్రెసర్‌ను చేతితో ఊపి చూడండి. అది మరీ ఎక్కువగా ఊగుతున్నట్లు అనిపిస్తే, వదులుగా ఉన్న నట్స్ , బోల్ట్లను గట్టిగా బిగించండి. దీనివల్ల కంప్రెసర్ స్థిరంగా మారి, విసుగు పుట్టించే శబ్దాల నుండి ఉపశమనం లభిస్తుంది.
తాజావార్తలు
-
CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై రేవంత్ ఫైర్.. ‘భారం మోస్తున్నాం’!
-
Allu Arjun : రాకా హైప్ ఓకే.. కంటెంట్ ఆ రేంజ్ లో లేక పోతే?
-
CM Revanth Reddy : హైదరాబాద్‌కు కొత్త రూపు.. మూడు కార్పొరేషన్ల లోగోలు
-
Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?
-
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!