Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Tips Ragi Burfi Recipe Healthy Jaggery Sweet Benefits

Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!

Published Date :May 6, 2026 , 5:42 pm
By Shiva Ganesh
Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

Ragi Burfi Recipe: సాధారణంగా రాగి అనగానే రాగి సంగటి లేదా అంబలి మాత్రమే గుర్తొస్తాయి. కానీ రాగి పిండి, బెల్లంతో నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే ‘రాగి బర్ఫీ’ని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు తెలుసా. క్యాల్షియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉండే ఈ స్వీట్, కేవలం 15-20 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. స్వీట్ తినాలనిపించినప్పుడు ఆరోగ్యానికి హాని చేసే చక్కెర పదార్థాల కంటే, ఇలా ఇంట్లోనే స్వచ్ఛమైన నెయ్యి, బెల్లంతో చేసే ఈజీగా చేసుకునే ఈ రాగి బర్ఫీని ట్రై చేయడం ఎంతో మేలు. ఈ రుచికరమైన, ఆరోగ్యకరమైన రాగి బర్ఫీని సింపుల్‌గా ఎలా తయారీ చేసుకోవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:

Also Read

  • Vitamin D Deficiency : విటమిన్ డి లోపం.. కేవలం ఎండలో కూర్చుంటే సరిపోతుందా.?
  • Ragi Teepi Kudumulu: అమ్మమ్మల కాలం నాటి టేస్టీ రెసిపీ.. హెల్తీ 'రాగి తీపి కుడుములు' ఇలా ట్రై చేయండి!
  • Anemia in Children : చిన్నపిల్లల్లో రక్తహీనత.. తల్లిదండ్రులు గమనించాల్సిన హెచ్చరిక సంకేతాలు, నివారణ మార్గాలు.!
  • Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్‌గా చేసేయండి!
Add as a preferred
source on google

రాగి పిండి: 1 కప్పు

బెల్లం తురుము: 1 ¼ కప్పు

నీళ్లు: 2 కప్పులు

నెయ్యి: అర కప్పు (సుమారు 5-6 టేబుల్ స్పూన్లు)

బొంబాయి రవ్వ (సుజీ): ¼ కప్పు

యాలకుల పొడి: కొద్దిగా

జీడిపప్పు పలుకులు: గుప్పెడు

తయారీ విధానం..
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని, అందులో రెండు చెంచాల నెయ్యి వేయండి. తర్వాత జీడిపప్పు పలుకులను వేసి దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. అనంతరం అదే పాన్‌లో 1 కప్పు రాగి పిండి, ¼ కప్పు బొంబాయి రవ్వ వేసి లో ఫ్లేమ్ మీద 8-10 నిమిషాల పాటు పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. రవ్వ వేయడం వల్ల బర్ఫీకి మంచి టెక్స్చర్ వస్తుంది. మరొక పక్క గిన్నెలో 1 ¼ కప్పు బెల్లం తురుము, 2 కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. బెల్లం కరిగి నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆపేయాలి. దీనికి పాకం రానవసరం లేదు.

ముందుగా వేయించి పెట్టుకున్న రాగి పిండిలో మరిగించిన బెల్లం నీళ్లను వడకడుతూ పోయాలి. ఈ టైంలో ఉండలు కట్టకుండా గరిటెతో వేగంగా కలుపుతూ ఉండాలి. ఈ మిశ్రమం దగ్గర పడుతున్నప్పుడు మధ్యమధ్యలో నెయ్యి వేస్తూ కలుపుతుండాలి. మిశ్రమం పాన్‌కు అతుక్కోకుండా విడిపోతున్నప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు వేయాలి. మిశ్రమం అంతా ముద్దలా అయ్యి నెయ్యిని వదులుతున్నప్పుడు, ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్‌లోకి తీసుకోవాలి. పైన సమానంగా సర్ది 15-20 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. ఈ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత, మీకు నచ్చిన ఆకారంలో ముక్కలుగా కోసుకుంటే ఎంతో రుచికరమైన రాగి బర్ఫీ రెడీ అవుతుంది. ఈ స్వీట్‌ను రెడీ చేస్తున్నప్పుడు ఈ విషయాలను మాత్రం గుర్తుకు ఉంచుకోండి. పిండి వేయించేటప్పుడు మాడకుండా చూసుకోవాలి, లేదంటే స్వీట్ చేదు వస్తుంది. అలాగే బెల్లం తీపిని మీ రుచికి తగినట్లుగా కొంచెం పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు.

ప్రయోజనాలు ఇవే..
రాగి పిండి – బెల్లం కలిపి చేసే ఈ బర్ఫీ రుచిలోనే కాదు, ఆరోగ్య పరంగా కూడా అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ధాన్యాలన్నింటిలోకెల్లా రాగుల్లో క్యాల్షియం అత్యధికంగా ఉంటుంది. ఇవి ఎముకలను, దంతాలను దృఢంగా ఉంచుతాయి. పిల్లల్లో ఎదుగుదలకు, వృద్ధుల్లో వచ్చే ఎముకల బలహీనత సమస్యలను నివారించడానికి ఇవి ఎంతో తోడ్పడుతాయి. అలాగే రాగి పిండిలో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది, దానికి తోడు మనం చక్కెర బదులు బెల్లం వాడుతున్నాం. బెల్లంలో కూడా ఐరన్ పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో రక్త శాతం పెరుగుతుంది. రక్తహీనతతో బాధపడేవారికి ఇది ఒక అద్భుతమైన పోషక ఆహారంగా పని చేస్తుంది.

రాగిలో గ్లైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగవు. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను నెమ్మదిగా జరిగేలా చేసి, షుగర్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతాయి. రాగిలో ఉండే ‘ట్రిప్టోఫాన్’ అనే అమైనో ఆమ్లం ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల దీనిని కొద్దిగా తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది అనవసరమైన కొవ్వును కరిగించి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. రాగి పిండి సులభంగా జీర్ణమవుతుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. ఇది పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి జీర్ణ ప్రక్రియను సాఫీగా సాగేలా చేస్తుంది.

రాగులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. అలాగే రాగిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు సహజమైన రిలాక్సంట్‌గా పనిచేస్తాయి. ఇది మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలను తగ్గించడంలో సహాయపడుతాయి. ఈ బర్ఫీలో ఉపయోగించే స్వచ్ఛమైన నెయ్యి చర్మ ఆరోగ్యానికి, మెదడు చురుకుదనానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. బయటి మిఠాయిల కంటే ఇంట్లోనే ఇలా ఆరోగ్యకరమైన పదార్థాలతో స్వీట్ చేసుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. మీకు సమయం ఉన్నప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ప్రయత్నించి చూడండి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Calcium Rich Food
  • Easy Sweet Recipes Telugu
  • Finger Millet Recipes
  • Healthy Ragi Sweets
  • healthy snacks for kids

తాజావార్తలు

  • Ragi Burfi Recipe: ఎముకలకు బలం.. రక్తహీనతకు చెక్.. వంటరాని వాళ్లు కూడా ఈజీగా చేసుకునే హెల్తీ స్వీట్!

  • Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!

  • DMK-Congress: ‘‘కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది’’.. డీఎంకే తీవ్ర ఆగ్రహం..

  • Peddi : థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి!

  • CM Revanth Reddy: సీఎం సీరియస్.. నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ ఆపొద్దు.. డీజీపీకి కీలక ఆదేశాలు!

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions