Pratyusha Paul : చార్మినార్ సాక్షిగా బెంగాల్ నటికి వేధింపులు: నిందితుడికి ‘చిప్పకూడు’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో చారిత్రక కట్టడం చార్మినార్ సాక్షిగా ఒక షాకింగ్ ఘటన వెలుగుచూసింది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రముఖ నటి ప్రత్యూష పాల్ వేధింపులకు గురవ్వడం స్థానికంగా కలకలం రేపింది. చార్మినార్ ప్రాంతంలో కుటుంబ సభ్యులతో కలిసి ఉండగానే ఒక వ్యక్తి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళ్తే.. బెంగాలీ నటి ప్రత్యూష పాల్ ఈ నెల 2వ తేదీన తన కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ పర్యటనకు వచ్చారు. సాయంత్రం వేళ ఆమె చార్మినార్‌ను సందర్శించారు. చార్మినార్ పరిసరాల్లోని ఫుట్‌పాత్‌పై వస్తువులు చూస్తూ షాపింగ్ చేస్తున్న సమయంలో టోలిచౌక్‌కు చెందిన అబ్దుల్ వాజీద్ (40) అనే వ్యక్తి ఆమెను గమనించాడు.
రాత్రి సుమారు 7:30 గంటల సమయంలో ఆమెను అనుసరిస్తూ, కుటుంబ సభ్యుల ముందే అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నటి, వెంటనే స్థానిక చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగారు. ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి, నిందితుడిని అబ్దుల్ వాజీద్‌గా గుర్తించారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, విచారణ చేపట్టిన న్యాయమూర్తి అతడికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. సెలబ్రిటీ అని కూడా చూడకుండా బహిరంగ ప్రదేశంలో వేధింపులకు పాల్పడిన నిందితుడిపై పోలీసులు వేగంగా స్పందించి శిక్ష పడేలా చేయడంపై నటి పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. నగరానికి వచ్చే పర్యాటకులు, సామాన్య ప్రజానీకం ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటే భయపడకుండా పోలీసులను ఆశ్రయించాలని అధికారులు సూచిస్తున్నారు.
Also Read
- UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
- సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
- Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
- Sunil Gavaskar: ఇంకెంతకాలం ఆటగాళ్లను పిండేస్తారు? ఐసీసీకి గవాస్కర్ సూటి ప్రశ్న
తాజావార్తలు
-
Bigg Boss Telugu: షాకింగ్ ఎలిమినేషన్.. బిగ్‌బాస్ హౌస్ నుంచి మరొకరకు ఔట్..
-
UPI Tap & Pay and MyUPI: సరి కొత్త ఫీచర్లు.. QR స్కాన్, పిన్ ఎంట్రీకి గుడ్‌బై.. ఇంటర్నెట్ లేకున్నా పేమెంట్స్..!
-
సొంతిల్లు లేని వారికి గుడ్‌న్యూస్.. రూ.8 లక్షల రుణాలపై 4% సబ్సిడీ.. PMAY-U 2.0 పథకం పూర్తి వివరాలు ఇవే..
-
Kuldeep Yadav: 10 వికెట్స్ పడగొట్టిన కుల్దీప్ యాదవ్.. గౌతమ్ గంభీర్ చూస్తున్నాడా?
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ ఎప్పుడు ? రిలీజ్‌కు ముందు మేకర్స్ మాస్టర్ ప్లాన్ ఇదేనా!
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?