Health Tips : పొన్నగంటి కూరను ఇలా తీసుకుంటే చాలు.. ఆ రోగాలు జన్మలో రావు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం ఎక్కువగా తీసుకొనే ఆకు కూరల్లో పొన్నగంటి కూర ఒకటి.. శరీరానికి కావలసిన అన్ని పోషకాలు వీటిలో దొరుకుతాయి.. ఈ ఆకు నీరు పారే ప్రాంతాల్లో ఏడాది పొడవునా లభిస్తుంది.. ఈ ఆకుకూర విరివిగా పెరుగుతుంది. దీనితో పప్పు, పచ్చడి, కూర వంటి వాటిని తయారు చేసి తీసుకుంటారు. పొన్నగంటి కూరతో చేసే వంటకాలు చాలా రుచిగా ఉంటాయి. అలాగే దీనిని తీసుకోవడం మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. దీనిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.. ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ ఆకు కూరలో బీటా కెరోటీన్, ఐరన్, ఫైబర్, క్యాల్షియం, విటమిస్ సి వంటి ఎన్నో పోషకాలు ఉన్నాయి. పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. కంటి చూపు మెరుగుపడుతుంది. వయసు పైబడడం వల్ల వచ్చే కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. తలనొప్పితో భాధ పడేవారు దీన్ని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.. మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.. అలాగే ఈ సీజన్ వచ్చే అనేక వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది..
Also Read
- Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
- Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
- Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
- Turmeric Stains Remove Tips: బట్టలపై పసుపు మరకలతో ఇబ్బందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో శుభ్రం చేసుకోండి
ఇకపోతే పొన్నగంటి కూర రసంలో తేనె కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. పొన్నగంటి ఆకుకూరను తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి.. ఈ ఆకు రసంను తీసుకొని ముఖానికి రాస్తే మచ్చలు, మొటిమలు వెంటనే తొలగిపోతాయి.. చర్మం రంగు కూడా మెరుగు పడుతుంది.. ఇకపోతే వారానికి రెండు సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
CM Revanth Reddy : మున్సిపల్ అధికారులకు సీఎం రేవంత్ అల్టిమేటం..
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
HYDRA Ranganath: రూ.1.5 లక్షల కోట్ల ప్రభుత్వ భూములు కాపాడాం
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!