NTV Telugu Site icon

COVID-19: షాకింగ్ న్యూస్.. కోవిడ్ -19 నుంచి కోలుకున్న వ్యక్తులకు ఈ సమస్యలు తప్పవు

Syndrome

Syndrome

కోవిడ్ -19 వ్యాధి నుంచి కోలుకున్న వ్యక్తులపై భారతదేశం, విదేశాలలో నిర్వహించిన అధ్యయనాలలో కొన్ని సాధారణ అంశాలు వెలువడ్డాయి. ఆసుపత్రిలో చేరినా.. ఆసుపత్రిలో చేరకుండానే కోలుకుంటున్న, మిశ్రమ పద్ధతుల ద్వారా కోలుకున్న రోగులలో అలసట అనేది చాలా తరచుగా వస్తుందట. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత.. అలసట చాలా మందికి ఇబ్బందిగా మారిందని నివేదికలు స్పష్టం చేశాయి. సాధారణంగా.. శ్వాస ఆడకపోవడం, వాసన, రుచిని తెలియకపోవడం, అస్పష్టమైన దృష్టి, తలనొప్పి, దగ్గు, తేలికపాటి జ్వరం, భయం, మైకం, నిరాశ, కండరాలు-కీళ్ల నొప్పులు వంటివి కోవిడ్ లక్షణాలు అని అందరికీ తెలిసిందే. కోవిడ్ నుంచి కోలుకున్న 45 శాతం మందికి ఇందులో కనీసం ఒక లక్షణమైనా పరిష్కారం కాలేదని తేలింది.

READ MORE: Anushka Sharma: పెళ్లికి ముందే తల్లినయ్యా.. అనుష్క శర్మ షాకింగ్ కామెంట్స్!

డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక..
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) నివేదిక ప్రకారం.. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, నిద్ర లేమి, నిరంతర దగ్గు, ఛాతీ నొప్పి వంటి సమస్యలు ఉన్నాయని రాజ్యసభలో ఒక ప్రశ్న తలెత్తింది. దీనికి కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. కోవిడ్ తర్వాత సమస్యలు అనేక అంశాలపై ఆధారపడి ఉంటాయని సమాధానంలో పేర్కొంది. రోగనిరోధక వ్యవస్థ యొక్క అసమతుల్యత, ఆటో-ఇమ్యూనిటీ లోపం, డైస్బియోసిస్, మైక్రోథ్రాంబి, దైహిక ఫైబ్రోసిస్, నిరంతర సీఎన్ఎస్ ఇన్ఫెక్షన్ వంటి అంశాలు కోవిడ్ అనంతర సమస్యలకు కారణం కావచ్చని తెలిపింది.

READ MORE:Unstoppable with NBK : బాలయ్య అన్‌స్టాపబుల్ సీజన్ – 3.. షూటింగ్ ఎప్పుడంటే..?

ఇప్పటివరకు 194 అధ్యయనాలు..
కోవిడ్ 19పై ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 194 అధ్యయనాలు వెలువడ్డాయి. ఖండాల వారీగా నివేదికల సంఖ్య ఇలా ఉంది. ఐరోపాలో 106 అధ్యయనాలు నిర్వహించబడ్డాయి. ఆసియాలో 49, ఉత్తర, దక్షిణ అమెరికాలో 31.. ఇతర ఖండాలలో 8 సహా అధ్యయనాలు వెల్లడించాయి. ఈ అధ్యయనాలు క్రమబద్ధీకరించి.. సమీక్ష జరిపారు. ప్రతి రెండు అధ్యయనాల నుంచి మిశ్రమ ఫలితాన్ని రాబట్టారు. ఆసుపత్రిలో చేరిన (28.4 శాతం), ఆసుపత్రిలో చేరని (34.8 శాతం), మిశ్రమ (25.2 శాతం) వ్యక్తులు చాలా తరచుగా అలసట లక్షణాలను కలిగిఉన్నట్లు నివేదించాయి. ఆసుపత్రిలో చేరిన రోగులలో అత్యంత ప్రబలంగా ఉన్న ఐదు లక్షణాలు.. అలసట (28.4 శాతం-70 అధ్యయనాల ప్రకారం), నొప్పి, అసౌకర్యం (27.9 శాతం-10 అధ్యయనాలు), నిద్రలేమి (23.5 శాతం-34 అధ్యయనాలు), శ్వాస ఆడకపోవడం (22.6 శాతం-70 అధ్యయనాలు) వంటి లక్షణాలను కనుగొన్నట్లు అధ్యయనాలు వెలువరించాయి.