జుట్టు అనేది ఆడవారితో పాటు మగవారికి కూడా ముఖ్యమే. జుట్టు ఆడ, మగవారి అందంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. జుట్టు పొడుగ్గా ఉండటం అమ్మాయిలకు ఎంత ఇష్టమో.. తలపై ఒత్తుగా, నిండైన హెయిర్ ఉండటం కూడా అబ్బాయిలకు అంతే ఇష్టం. అయితే, ఈ రోజుల్లో చాలా మంది యువత బట్టతల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య మానసికంగా వారిని చిదిమేస్తుంది. కాగా.. బట్టతల రావడంపై అనేక అపోహలు చక్కర్లు కొడుతుంటాయి. అందులో ప్రధానమైన ప్రశ్న వంశపారపర్యంగా బట్టతల…
ఇప్పట్లో తెల్లజుట్టు చిన్న వయసులోనే వస్తోంది. నిజానికి తెల్లజుట్టు మొదలైన కొత్తలో అక్కడక్కడా తెల్లవెంట్రుకలు కనిపిస్తాయి. వీటిని చూసిన తరువాత చాలామంది చేసే మొదటి పని వాటిని లాగి పారేయడం. ఒకటో రెండో అంతే కదా అవి కనిపిస్తే ఏం బావుంటుందనే కారణంతో ఇలా లాగేస్తారు. అయితే.. ఓ తెల్ల వెంట్రుకను పీకేస్తే దాని స్థానంలో మరిన్ని తెల్ల వెంట్రుకలు వస్తాయని అపోహపడుతుంటారు. అందులో నిజం లేదు.