Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Trending News Natural Home Remedy Mice Repellent Banana Trick

ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్ పెట్టండి.!

Published Date :January 9, 2026 , 4:17 pm
By Gogikar Sai Krishna
  • అరటిపండుతో సహజ ఎలుక నివారణ
  • అరటి తొక్కల ఉండలు కూడా పనికే
  • పటిక స్ప్రే ప్రభావం ఎక్కువ
  • రసాయనాల్లేకుండా ఇంటిని క్లీన్‌గా
ఇంట్లో ఎలుకల బీభత్సమా..? ఈ చిన్న న్యాచురల్ చిట్కాతో వాటికి చెక్ పెట్టండి.!
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

ఇంట్లో ఎలుకలు చేరాయంటే ఇక ఆ ఇంట్లో వస్తువులకి రక్షణ ఉండదు. బట్టలు కొరకడం, కరెన్సీ నోట్లను నాశనం చేయడం, ఆహార పదార్థాలను పాడు చేయడం వంటి పనులతో అవి ఇంట్లో వారిని విసిగిస్తుంటాయి. అంతేకాకుండా, ఎలుకలు బయట నుంచి అనేక రకాల బ్యాక్టీరియాలను మోసుకొస్తాయి, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.

సాధారణంగా ఎలుకలను తరిమికొట్టడానికి మనం మార్కెట్లో దొరికే రసాయన మందులను వాడుతుంటాం. అయితే ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు ఉన్నప్పుడు ఈ విషపూరిత మందులు వాడటం కొంత రిస్క్‌తో కూడుకున్న పని. ఇలాంటి సమయంలో యోగా నిపుణులు కైలాష్ బిష్ణోయ్ సూచించిన ఒక సహజసిద్ధమైన చిట్కా అద్భుతంగా పనిచేస్తుంది. కేవలం ఒక అరటిపండుతో ఎలుకలను ఎలా తరిమికొట్టవచ్చో ఇప్పుడు చూద్దాం.

Also Read

  • Ragi Samosa: రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. హెల్తీ 'రాగి సమోసా'ను 'సింపుల్‌గా ఇలా ట్రై చేయండి!
  • Buttermilk vs Lassi: మజ్జిగ వర్సెస్ లస్సీ.. ఈ మండుటెండలో ఏది ఎక్కువ మేలు చేస్తుంది..?
  • Beetroot Buttermilk Recipe: నిమిషాల్లో బీట్‌రూట్ మజ్జిగ రెడీ.. ప్రతిరోజూ తాగితే ముఖం మెరిసిపోతుంది..!
  • Barley Upma Recipe: రెగ్యులర్‌ బ్రేక్‌ఫాస్ట్‌ బోర్ కొట్టిందా..? రుచికరమైన, ఆరోగ్యకరమైన బార్లీ ఉప్మా ట్రై చేయండి..
Add as a preferred
source on google

 

Rats

CP Sajjanar : చైనా మాంజా అమ్మినా.. వాడినా జైలుకే..!

1. అరటిపండుతో మాయా చిట్కా : ఈ పద్ధతి చాలా సులభం , తక్కువ ఖర్చుతో కూడుకున్నది.

కావలసిన పదార్థాలు:

  • ఒక అరటిపండు
  • సిట్రిక్ యాసిడ్ పౌడర్ (లేదా ఈనో) – 1 టీస్పూన్
  • బేకింగ్ సోడా – 1 టీస్పూన్
  • పసుపు – 1 టీస్పూన్

తయారీ విధానం: ముందుగా అరటిపండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేటులో పెట్టుకోవాలి. ఆ ముక్కల మీద వరుసగా సిట్రిక్ యాసిడ్ పౌడర్, బేకింగ్ సోడా , పసుపును చల్లాలి.

ఎలా ఉపయోగించాలి? ఈ ముక్కలను ఎలుకలు ఎక్కువగా సంచరించే ప్రాంతాల్లో, అంటే అల్మారాల వెనుక, వంటగది మూలల్లో లేదా గ్యాస్ స్టవ్ కింద ఉంచాలి. ఈ మిశ్రమం యొక్క ప్రభావం వల్ల ఎలుకలు ఆ ప్రాంతం నుంచి పారిపోతాయి. కేవలం ఎలుకలే కాకుండా, దోమలు , ఈగలను నివారించడానికి కూడా ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

2. అరటి తొక్కల ఉండలు

ఒకవేళ మీరు పండును వృథా చేయకూడదనుకుంటే, అరటి తొక్కలతో కూడా ఈ ట్రిక్ ప్లే చేయవచ్చు.

విధానం: అరటి తొక్కలను మిక్సీలో వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఇందులో సిట్రిక్ యాసిడ్ లేదా బేకింగ్ సోడా కలపాలి.

ఇప్పుడు కొద్దిగా గోధుమపిండి తీసుకుని నీళ్లతో కలిపి చిన్న ఉండలుగా చేసి, ఆ ఉండల మధ్యలో ఈ అరటి తొక్కల మిశ్రమాన్ని ఉంచాలి.

వీటిని ఎలుకలు తిన్నప్పుడు వాటి జీర్ణవ్యవస్థలో గ్యాస్ ఏర్పడి, అవి అసౌకర్యానికి గురై ఇంటి నుండి బయటకు పారిపోతాయి.

3. పటికతో ఎలుకల నివారణ (Alum Spray)

ఎలుకలను తరిమికొట్టడానికి పటిక (Alum) మరొక అద్భుతమైన మార్గం.

స్ప్రే తయారీ: పటికను పొడి చేసి నీటిలో బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో నింపుకోవాలి.

ఉపయోగం: ఎలుకలు తిరిగే అటకలు, స్టోర్ రూమ్‌లు లేదా డ్రైనేజీ పైపుల దగ్గర ఈ నీటిని స్ప్రే చేయాలి. పటిక యొక్క ఘాటైన వాసన ఎలుకలకు నచ్చదు, కాబట్టి అవి ఆ దరిదాపుల్లోకి రావు.

ఎలుకల మందులు వాడి అవి ఇంట్లోనే ఎక్కడో ఒకచోట చనిపోతే వచ్చే దుర్వాసన చాలా భయంకరంగా ఉంటుంది. కానీ ఈ సహజ చిట్కాల వల్ల ఎలుకలు చనిపోకుండా ఇంటి నుండి పారిపోతాయి. తద్వారా ఇల్లు శుభ్రంగా ఉంటుంది , ఎటువంటి కెమికల్స్ భయం ఉండదు.

గమనిక: పైన పేర్కొన్న సమాచారం సోషల్ మీడియాలో నిపుణులు పంచుకున్న వివరాల ఆధారంగా అందించబడింది. దీని ప్రభావం ఆయా పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

 

Rajasaab : సినిమా టికెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు ఆగ్రహం.. “ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా?” అంటూ..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • banana mice repellent
  • eco-friendly pest control
  • health and home care
  • Home Tips
  • indian home hacks

తాజావార్తలు

  • Vishwambhara Two Parts : రెండు భాగాలుగా విశ్వంభర.. కన్ఫమ్ చేసిన దర్శకుడు

  • IPL 2026 Playoffs: ఒకే రోజు రెండు జట్లు ఇంటికి.. టాప్ లేపిన ఆర్సీబీ.. ప్లేఆఫ్స్ రేసు మరింత రసవత్తరం!

  • Hero to Turn Director : హిట్టు కోసం తానే దర్శకత్వం చేసుకుంటున్న హీరో

  • Sai Pallavi: ‘రామాయణ’ టీమ్‌పై సాయిపల్లవి ఫ్యాన్స్‌ ఫైర్!

  • Dropped Catch: ఆ ఒక్క క్యాచ్ మిస్.! ఫలితం.. ఐపీఎల్ 2026 నుండి ముంబై ఇండియన్స్ అవుట్..

ట్రెండింగ్‌

  • Forbes Survey: ఆఫీస్ ‘ప్రేమాయణం’.. 40 శాతం మంది తమ భాగస్వామిని మోసం చేస్తున్నారట! షాకింగ్ గణాంకాలు

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions