ఇంట్లో ఎలుకలు చేరాయంటే ఇక ఆ ఇంట్లో వస్తువులకి రక్షణ ఉండదు. బట్టలు కొరకడం, కరెన్సీ నోట్లను నాశనం చేయడం, ఆహార పదార్థాలను పాడు చేయడం వంటి పనులతో అవి ఇంట్లో వారిని విసిగిస్తుంటాయి. అంతేకాకుండా, ఎలుకలు బయట నుంచి అనేక రకాల బ్యాక్టీరియాలను మోసుకొస్తాయి, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. సాధారణంగా ఎలుకలను తరిమికొట్టడానికి మనం మార్కెట్లో దొరికే రసాయన మందులను వాడుతుంటాం. అయితే ఇంట్లో చిన్న పిల్లలు లేదా పెంపుడు జంతువులు…