Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Moringa Soup: చలికాలంలో చలి గాలులకి ముఖంలో ఉన్న కాంతి తగ్గిపోయి, బుగ్గలపై సహజమైన ఎరుపుదనం లేదా గ్లో (Natural Glow) తగ్గుతుంది. దీనికోసం ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ (Skin Care Products) మీద వేలల్లో డబ్బులు తగలెట్టడం కంటే, శరీరాన్ని లోపల నుంచే హెల్తీగా, గ్లోయింగ్‌గా మార్చుకోవడం చాలా బెటర్. ఈ వింటర్ సీజన్ (Winter Season) లో రాత్రి పూట డిన్నర్ టైమ్‌లో (Dinner Time) ఒక గిన్నె వేడి వేడి మోరింగా సూప్ (Moringa Soup) తాగితే.. మీ ఆరోగ్యం, అందం రెండూ అదిరిపోతాయి. సహజన్ లేదా మునిగ ఆకుల్లో (Moringa Leaves) విటమిన్స్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని శుభ్రం చేసి (Blood Purification), ముఖంలో సహజమైన కాంతిని, బుగ్గలపై నేచురల్ గ్లోను తీసుకురావడానికి సూపర్‌గా పనిచేస్తాయి. ఈ హెల్తీ సూప్ తయారీ విధానం, కొన్ని సీక్రెట్ టిప్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
కావలసిన పదార్థాలు (Ingredients):
Also Read
- Homemade Recipes: రొటీన్ పచ్చళ్లు బోర్ కొట్టాయా? ఈ పచ్చడి ట్రై చేయండి.. ఒక్క ముద్ద తిన్నా వదిలిపెట్టరు!
- Easy Lunch Recipes: రోజూ అవే చారులా? మజ్జిగతో ఇలా చేసి చూడండి, ప్లేట్ ఖాళీ కావాల్సిందే!
- Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ "ఎగ్ లబాబ్దార్" సులువుగా చేసుకోండి ఇలా..!
- Heart Health Tips: గుండె ఆరోగ్య రహస్యం ఇదే.. మంచి ఆహారంతో పాటు మంచి అనుబంధాలు కూడా!
మునిగ ఆకులు లేదా మోరింగా ఆకులు (Moringa Leaves): 1 కప్పు (బాగా కడిగినవి)
వెల్లుల్లి రెబ్బలు (Garlic Cloves): 4-5 (సన్నగా తరిగినవి)
అల్లం (Ginger): చిన్న ముక్క (తురిమినవి)
ఉల్లిపాయ లేదా క్యారెట్ (Onion / Carrot): 1 చిన్నది (సన్నగా తరిగినవి – సూప్ చిక్కదనం కోసం)
మిరియాల పొడి (Black Pepper Powder): అర టీస్పూన్
వెన్న లేదా నెయ్యి (Butter / Desi Ghee): 1 టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ లేదా ఓట్స్ పౌడర్ (Cornflour / Oats Powder): 1 స్పూన్ (లైట్ బైండింగ్ కోసం – మీ ఇష్టం)
తగినంత ఉప్పు మరియు నల్ల ఉప్పు (Salt & Black Salt)
నేచురల్ గ్లో, పర్ఫెక్ట్ టెక్స్చర్ కోసం సీక్రెట్ టిప్స్:
తాజా ఆకుల వాడకం: సూప్ కోసం ఎప్పుడూ ఫ్రెష్‌గా ఉండే పచ్చని మునిగ ఆకులనే వాడాలి. వీటిలోనే పోషకాలు (Nutrients) ఎక్కువగా ఉండి స్కిన్‌ను నేచురల్‌గా మెరిపిస్తాయి. ఇక, ఆ ఆకులను నీటితో కలిపి కనీసం 10 నిమిషాల పాటు సన్నని మంటపై ఉడికించాలి. అప్పుడే ఆకుల్లోని పోషక గుణాలు (Goodness) నీటిలోకి బాగా దిగుతాయి.
తయారీ విధానం (Preparation Method):
ముందుగా ఒక పాన్‌లో 2 గ్లాసుల నీళ్లు పోయాలి. అందులో కడిగిన మునిగ ఆకులు, తరిగిన ఉల్లిపాయ, క్యారెట్, అల్లం, వెల్లుల్లి వేసి మీడియం మంటపై 10 నిమిషాల పాటు ఆకులు మెత్తబడే వరకు ఉడికించాలి. ఉడికించిన మిశ్రమాన్ని కొద్దిగా చల్లారబెట్టి, తర్వాత మిక్సీ జార్లో వేసి స్మూత్ ప్యూరీలా (Smooth Puree) గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ ప్యూరిని ఒక స్ట్రైనర్ (Strainer) సహాయంతో వడకట్టాలి. దీనివల్ల పీచు పదార్థాలు (Fibers) వేరుపడి సూప్ వాటర్ మాత్రం నీట్‌గా వస్తుంది. ఇక, మారో ఒక పాన్‌లో 1 స్పూన్ వెన్న వేసి వేడి చేయాలి. అందులో వడకట్టిన సూప్ వాటర్ పోయాలి. సూప్ చిక్కగా రావాలంటే 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్ వాటర్ కలుపుకోవచ్చు. ఇక, ఈ సూప్‌లో మిరియాల పొడి, సాధారణ ఉప్పు, నల్ల ఉప్పు వేసి బాగా కలపాలి. ఒక మంచి పొంగు వచ్చే వరకు ఉడికించాలి. అంతే! ఎన్నో పోషకాలు కలిగిన చర్మాన్ని మెరిపించే ఆకుల సూప్ (Moringa Soup) రెడీ! దీన్ని వింటర్ ఈవినింగ్స్లో డిన్నర్‌కి ముందు తాగి, మంచి హెల్త్ తో పాటు సూపర్ గ్లోను ఆస్వాదించండి.
తాజావార్తలు
-
Idupu Kayitham Teaser: ‘ఇడుపు కాయితం’ అంటే.. విడాకులా..?
-
Moringa Soup: ఖరీదైన స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ వద్దు.. వింటర్లో బుగ్గలపై సహజమైన ఎరుపుదనం తెచ్చే సూప్ ఇదే..
-
Kulgam Terror Attack: కుల్గామ్‌లో CRPFపై ఉగ్రదాడి.. కొత్త ఉగ్ర సంస్థ బాధ్యత వహించినట్లు ప్రకటన, RSSకు బెదిరింపులు
-
Gold and Silver Prices Fall: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
-
Sekhar Master: శంషాబాద్ వద్ద రోడ్డు ప్రమాదం.. కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌కు గాయాలు..
ట్రెండింగ్
-
Cigarette Prices Hike: ధూమపాన ప్రియులకు షాక్.. మరోసారి సిగరెట్ల ధరల బాదుడు..! ఒక్క ప్యాకెట్‌పై ఏకంగా..
-
Kusal Mendis: విమర్శకుల నోళ్లు మూయించిన కుశాల్ మెండిస్.. 13,000 పరుగుల మైలురాయిని అందుకున్న ఆటగాడిగా ఘనత..!
-
Rohit Sharma: ముంబై ఇండియన్స్‌కి మరోసారి కెప్టెన్‌గా రోహితేనా..? స్టార్ ప్లేయర్ నోరుజారడంతో లీకైన అసలు మ్యాటర్..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!